
MLA Donthi Madhav Reddy
పేద ప్రజల సంక్షేమమే నాధ్యేయం
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
దుగ్గొండి మండలం రేకంపల్లి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం
నర్సంపేట,నేటిధాత్రి:
నియోజకవర్గ పేద ప్రజల అభివృద్దే తన లక్ష్యం అని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పట్ల దుగ్గొండి మండలంలో పైలెట్ ప్రాజెక్టు రేకంపల్లి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు ఇజ్జగిరి జయ చేరాలు ఇంటి నిర్మాణం పూర్తిచేసి గృహప్రవేశం కార్యక్రమం చేపట్టారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాధవ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగానే ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయడం సంతోషంగా ఉందన్నారు.నియోజకవర్గ పేద ప్రజల సంక్షేమమే నా ధ్యేయమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు.నియోజకవర్గం వ్యాప్తంగా మొదటి దఫాలో ప్రజలకు 3500 ఇండ్లు మంజూరు పత్రాలు ఇచ్చాము.రెండో దఫాలో మరో 3500 ఇండ్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపల్లి దేవేందర్ రావు, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ గౌడ్,మాజీ సర్పంచ్ ఎర్రల బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్లు చెన్నూరు కిరణ్ రెడ్డి, ఒలిగే నర్సింగరావు,ఇంగోలి రాజేశ్వరరావు, క్లస్టర్ ఇంచార్జిలు మట్ట రాజు,రొట్టె రమేష్,మార్కెట్ డైరెక్టర్లు దంజానాయక్, హింగే రామారావు ,
మండల నాయకులు జంగిల్ రవి, అజ్మీర రవీందర్,నల్ల వెంకటయ్య, పొగాకు వెంకటేశ్వర్లు, బ్లాక్ యూత్ అధ్యక్షులు బొమ్మినేని భరత్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు మాదాసి సాంబయ్య, మండల యూత్ నాయకులు కోరే రాజేష్, సుకినె నాగరాజు, సుకినె శ్రీను, కొరకల ప్రశాంత్, ఈద సురేందర్, కొలుగూరి సుమంత్, గాండ్ల ప్రతిష్,నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.