‘ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం’
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
నేటిధాత్రి:
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని కల్వరీ గుట్ట మీద నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు మరియు వాటర్ ట్యాంక్ కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కల్వరీ గుట్ట పైకి వచ్చి ప్రార్థనలు నిర్వహించుకునే క్రైస్తవ సోదరులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సీసీ రోడ్ ను అలాగే తాగునీటి సౌకర్యం కొరకు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. భక్తులకు ఇన్నాళ్లు రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు బెక్కెరి మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జాజిమొగ్గ నరసింహులు, క్రిస్టియన్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు సామ్యూల్ దాసరి , కల్వరీ ఎంబీ చర్చి పాస్టర్ మరియు చైర్మన్ ఎస్.వరప్రసాద్, వైస్ చైర్మన్ జాకబ్, సెక్రెటరీ డేవిడ్, రాజు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.