నూతన ఎరువుల గోదాం,గ్రామైక్య మహిళా సంఘం ప్రారంభించిన ప్రభుత్వ విప్
కలికోట సూరమ్మ ప్రాజెక్టు పూర్తి చేస్తాం
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.. బుధవారం కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి. భూషణ్రావుపేట వారి ఆధ్వర్యంలో నిర్మించిన ఎరువుల గోదాం ను, గంభీర్ పూర్ గ్రామంలో గ్రామైక్య మహిళా సంఘం భవనాన్ని స్థానిక నాయకులతో కలసి ప్రారంభించారు
వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోనే రైతులకు మేలు జరుగుతుందని రైతు సంక్షేమం పై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతుంది అన్నారు..
రైతులకు ఉపయోగపడే విధంగా నూతన ఎరువులకు పోదాం నిర్మాణం చేపట్టి దానిని అందుబాటులో చేయండి తీసుకువచ్చి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు..
ప్రపంచవ్యాప్తంగా వరి ఉత్పత్తితో పాటు వాణిజ్య పంటలలో మన దేశం, తెలంగాణ ప్రాంతం పెట్టింది పేరుగా నిలవడం మనకు గర్వకారణం అన్నారు..ప్రభుత్వం రైతులకు ముద్దు ధర కల్పిస్తోందన్నారు..
ప్రభుత్వాలు మారిన ప్రజా సంక్షేమం రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రైతుల కోసం పాటుపడతామన్నారు..
2008 లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నపుడు ఏకకాలంలో రైతులకు 68 వేల కోట్లు రుణమాఫీ చేశామని మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీతో రాష్ట్రంలో 31 వేల కోట్లు చేయడం జరుగుతుందని అన్నారు..
రైతు భరోసా కోసం రైతుల నుండి అభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతుందని,రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చామని గతంలో గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు ఇచ్చారని కానీ ఇప్పుడు నిజమైన రైతులకు ఇస్తామని, దానికోసం రాష్ట్రప్రభుత్వం ఉప సంఘం వేసిందన్నారు…
రైతులకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వార రైతులకు సాగు నీరు అందించే లక్ష్యం పెట్టుకుంది అన్నారు..
గతంలో ప్రతిపక్ష నేత గా అనేక ఆందోళనలు చేసిన వాడిగా నేడు ప్రజా ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగాగెలుపొందనని కథలాపూర్ భీమారం మేడిపల్లి మేడిపల్లి మండలాలకు త్రాగు సాగు నిరం అందించే కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామన్నారు..
ఇప్పటికే కాల్వల సర్వే పూర్తయిందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి అన్నారు.. గత అసెంబ్లీ సమావేశాల్లో మన ప్రాంతం తరపున కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ ఆవశ్యకతను అసెంబ్లీలో ప్రస్తావించాను అన్నారు..
రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేసే తొమ్మిది ప్రాజెక్టుల్లో కలిగుట సూరమ్మ చెరువు ప్రాజెక్టు ఒకటి అన్నారు..
రాళ్ల ప్రాజెక్టు పై అధికారులతో చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.. కథలాపూర్ మండల పరిధిలోని అన్ని లింక్ రోడ్లను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు..
రాజకీయాలకతీతంగా మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం అన్నారు…