Goda Devi–Ranganatha Kalyanam Held Grandly
కమనీయంగా గోదాదేవి రంగనాథుల కళ్యాణం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, జనవరి 11: జహీరాబాద్ పట్టణంలోని హనుమాన్ మందిరం ప్రాంగణంలో ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి శ్రీ రంగనాథుల కళ్యాణం ఆదివారం నాడు కమనీయంగా సాగింది. ఆండాళ్ స్వరూపమైన గోదాదేవి శ్రీకృష్ణుడినే పరిణయం చేసుకోవాలనే తలంపుతో తన జీవిత సర్వస్వం అంకితం చేసినందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మహేశ్వరి సమాజ్ మహిళా భక్త బృందం గోదాదేవి శ్రీరంగనాథ్ లను అందంగా అలంకరించి పరిణయ వేదికను ఏర్పాటు చేశారు. గోదా రంగనాథుల కీర్తనలు ఆలపిస్తూ ఘనంగా వేడుకలు జరిపారు. ఈ సందర్బంగా వధూవరులైన గోదా రంగనాథులకు పట్టు వస్త్రాలను సమర్పించి అట్టహాసంగా కళ్యాణం జరిపించారు. కమనీయంగా సాగిన ఈ వేడుకల్లో మహేశ్వరి మహిళా సమాజ్, హనుమాన్ మందిరం ఆలయ కమిటీ, నగర సంకీర్తన బృందం పాల్గొనగా, భక్తులకు మహాప్రసాదాన్ని అందజేశారు
