వక్ఫ్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి.
మాజీ కో-ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్
పరకాల నేటిధాత్రి
ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను హరించడానికే వక్ఫ్ సవరణ బిల్లును తెచ్చారని ఇది మైనారిటీలను అణిచివేసే రాజ్యాంగ వ్యతిరేక బిల్లని దేశ వ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతీయడమే లక్ష్యంగా వక్ఫ్ బిల్లు తీసుకురావడం జరిగిందన్నారు.దేశ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయే ఒక దుశ్చర్యఅని ఈ బిల్లు ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా మరొకటి కాదని,వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడం కోసమే ఈ పన్నాగం పన్నుతున్నారని అన్నారు.వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఆందోళనలు చేస్తున్నా వారి ఆవేదన వినకుండా బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య అని ఈ బిల్లును కేంద్రం వెంటనేఉపసంహరించుకోవాలని మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్ డిమాండ్ చేసారు.