కొడిమ్యాల (నేటి ధాత్రి ):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో చింతల్లపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పాలకవర్గం, ప్రజలు అందరూ కలిసి బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ది సుంకె రవిశంకర్ కే కారు గుర్తు కే ఓట్లు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మాణం చేసుకున్నారు.
ఈరోజు ఇంటింటికీ ప్రచారం నిర్వహించడానికి చింతల్లపల్లి గ్రామానికి వచ్చిన సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, పి ఎ సి ఎస్ చైర్మన్ మేనేని రాజనర్సింగారావు, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్, వైఎస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు అంకం రాజేశం తీర్మానం కాపీని చింతల్లపల్లి సర్పంచ్ మల్యాల మహిపాల్, ఉపసర్పంచ్ రాజు, వార్డు సభ్యులు, కుల సంఘాల నాయకులు, మహిళలు అందరూ కలిసి అందజేశారు.