
వీణవంక,( కరీంనగర్ జిల్లా)
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి జమ్మికుంట పట్టణంలో బీ ఆర్ ఎస్ పార్టీ రోడ్ షో కి బయలుదేరిన 250 మంది కార్యకర్తలు నాయకులు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ ర్యాలీలో కొండపాక సర్పంచ్ అరుంధతి గిరిబాబు, ఉప సర్పంచ్ రాజ్ కుమార్, మండల నాయకులు కసర్ల సుధాకర్, గ్రామశాఖ అధ్యక్షులు ఈదునూరి భూమయ్య, యూత్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ అజయ్ కార్యకర్తలు సదయ్య సల్పల సమ్మయ్య, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.