AIMIM Demands Withdrawal of VBG Ram Ji Bill
ఉపాధి కూలీల పొట్టకొట్టే వీబిజీ రామ్ జీ బిల్లును రద్దుచేయాలి…..!
◆-: ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి నూతనంగా తీసుకొచ్చిన వీ బిజీ రామ్ జీ బిల్లును రద్దు చేయాలని జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడంలో భాగంగానే ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి రాముని పేరుతో బిల్లు తీసుకొచ్చిందని ఆరోపించారు. దేవుని పేరుతో కోట్లాది మంది ప్రజల ఉపాధిని కాల రాసిందని ఆరోపించారు. కూలీలకు చెల్లించే నిధులను ఎవరు చెల్లించాలనే స్పష్టత లేదన్నారు. జాబుకార్డుల రేష్నలైజేషన్ పేరుతో ఇప్పటికే కోట్లాదిమంది ఉపాధి కూలీల జాబు కార్డులను తొలగింపు ప్రక్రియ ప్రారంభించిందని తెలిపారు. వి బీజి రామ్ జీ అనే సాధారణ పథ కాన్ని తీసుకురావాడాన్ని ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు వ్యతిరేకించాలని కోరారు. గత 20 సంవత్స రాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం ద్వారా గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు, పేద ప్రజలకు లబ్ధి చేకూర్చిందని అన్నారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరు గుపడే విధంగా ఉప యోగపడిన ఉపాధి హామీ చట్టం కేంద్ర బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.
