Vande Mataram Inspires the Nation – Tahsildar Muppu Krishna
వందేమాతరం గీతం దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి.
#తహసిల్దార్ ముప్పు కృష్ణ.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సమైక్యంగా ఆలాపించడం ఎంతో గర్వకారణంగా ఉందని తహసిల్దార్ ముప్పు కృష్ణ అన్నారు. బంకిం చంద్ర చటర్జీ వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తహసిల్దార్ కార్యాలయం వద్ద పలువురు గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఉద్యమకారులకు వందేమాతర గీతం ఒక స్ఫూర్తినిచ్చిందని అదేవిధంగా భారత ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా వందేమాతరం గీతం నిలవడం గర్వించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
