
నర్సంపేట టౌన్,నేటిధాత్రి :
ప్లాస్టిక్ సంచుల వాడకం మానవాళి మనుగడకు పెను ప్రమాదమని స్వయంకృషి సంస్థ నిర్వాహకులు, సమాజ సేవకుడు “బెజ్జంకి ప్రభాకర్” హెచ్చరించారు.బుదవారం నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్వయంకృషి సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల వాడక నిషేధ దినోత్సవం సందర్బంగా బాలబాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ గా పాల్గొన్న బెజ్జంకి ప్రభాకర్ బాలబాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ తో పెను ప్రమాదమని వస్త్రంతో తయారైన సంచుల వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు.నిత్యం వాడే ఒక ప్లాస్టిక్ బ్యాగు మట్టిలో కలిసి పోయేందుకు సుమారు 100 నుండి 500 సంవత్సరాలు పడుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాంతారావు, పిఈటి స్వామి,అధ్యాపకులు, బాలబాలికలు పాల్గొన్నారు.