Irregularities in Double Bedroom House Allocation
అనర్హులను డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు
లబ్దిదారుల పట్ల పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నాం.
L1,L2,L3 కేటగిరిలు చేసిన వాటిని కూడా విస్మరించిన జిల్లా అధికారులు..
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
భూపాలపల్లి పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీ కార్యక్రమంలో నిన్న ఏదైతే గతంలో ఎంపిక చేసిన లబ్దిదారుల పట్ల పోలీస్ అధికారులు వ్యవహరించిన తీరు గాని, అధికారులు వ్యవహరించిన తీరును బిఆర్ఎస్ పార్టీ తరుపున ముక్తకంఠంతో ఖండిస్తున్నాం.
లబ్దిదారులను పోలీస్ స్టేషన్ లో చెట్టు కింద నిల్చోబెట్టి వారిని దొంగలాగ, నేరస్థుడిలా ట్రీట్ చేయడాని ఖండిస్తున్నాం.
గతంలో మాజీ గండ్ర వెంకట రమణా రెడ్డి ఎంపికైన లబ్దిదారుల వివరాలను మున్సిపాలిటీ కార్యాలయంలో నోటీస్ బోర్డులో అంటించి ప్రజల అభ్యంతరాలను కోరిన తరువాత వాటిని పరిగణలోకి తీసుకున్న తరువాతనే లబ్ది దారులకు ఇళ్ళను కేటాయించడం జరిగింది.
కానీ జిల్లా అడిషనల్ కలెక్టర్ హౌసింగ్ డిపార్ట్మెంట్, పిడి అధికారులు దొంగలాగా, రహస్యంగా పోలీస్ బందోబస్తు నడుమ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను పంపిణీ చేయడం పనికిమాలిన చర్యగా పరిగణిస్తున్నాం.
L1,L2,L3 కేటగిరి జాబితా చేసి కూడా వాటిని విస్మరించి డబ్బులు తీసుకుని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పేర్లను లబ్దిదారులుగా పరిగణలోకి తీసుకోవడాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారని ఏద్దేవా చేశారు.
ఇది చాలా బాధాకరమైన విషయం దీనికి పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్, జిల్లా అడిషనల్ కలెక్టర్, పీడీ, ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాలి.
గతంలో ఎంపిక చేసిన లబ్దిదారులను తొలగించడం సిగ్గుచేటు.
గతంలో ఎంపికైన లబ్ధిదారులలో అనర్హులను తొలగించి, అర్హులకు ఇవ్వాలి.
కానీ ఏదో పెద్ద పని చేసిన, ఏదో గొప్ప పని చేసినం అని చెప్పుకుంటే దానిని ఎవరిని ఒప్పుకోరు.
మీరు చేసిన ఈ తప్పిదం రానున్న ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ది చెప్పుతారు.
నిరుపేదలబ్దిదారుల పక్షాన పోరాడుతాం, కోర్టును ఆశ్రయించి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియచేస్తున్నాం.
ఈ సందర్భంగా చెపుతున్నాం అనర్హుల జాబితా ఇచ్చే దమ్ము మాకుంది, వారిని తొలగించి అర్హులైన వారికీ ఇచ్చే దమ్ము మీకు ఉందా.
ప్రజలను వంచించే చర్యలను మానుకోవాలని బిఆర్ఎస్ పార్టీ తరుపున హెచ్చరిస్తున్నాం.
ప్రజల పక్షాన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. అని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
