
Yadava Colony
నిరుపయోగంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను తొలగించాలి
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలోని యాదవ కాలనీ లోనీ ఇళ్ల మధ్యలో నిరుపయోగంగా ఉన్నా పెద్ద ట్రాన్స్ఫార్మర్ వల్ల ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. ఇదివరకు ఇండ్ల లైన్ 11 కెవి మీద పడిన ప్రమాదంలో యాదవ కాలనీ లోని దాదాపు 20 ఇంటిమీటర్ల తో పాటు ప్రతీ ఇంట్లో ఫ్యాన్స్, కూలర్లు,టీవీలు,లైట్స్ వంటి ఇంటి వస్తువులు నష్టపోయారు,కొత్తవి మీటర్లు అమర్చిన విషయం విద్యుత్ శాఖ సిబ్బంది కి, అధికారులకు తెలిసిన విషయమే.మీరు ఇచ్చిన “పొంచి ఉన్న ప్రమాదం” అనే కథనం ఓకే,కాకపోతే ట్రాన్స్ఫార్మర్ ఉపయోగం లో లేదు ఇది ఎప్పటికయన ప్రజలకు ప్రమాదమే దయచేసి ట్రాన్స్ఫార్మర్ డిస్మెంటల్ చేయగలరు.ట్రాన్స్ఫార్మర్ ఉపయోగం లో లేకనే తీగ జాతి చెట్లు అల్లుకొని ప్రమాదకరంగా మారింది.ఈ ట్రాన్స్ఫార్మర్ ను డిస్మెంటల్ చేసి రాబోయే ముప్పు నుండి కాలనీ వాసులను రక్షించాలని
మొర్రి నాగరాజు మాజీ తెలంగాణ రైతు సంఘం నడికూడ గ్రామ అధ్యక్షులు కోరారు.