ములుగులో అక్టోబర్ 26న మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మీటింగ్
Date 19/09/2024
—————————————-
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సమావేశం అక్టోబర్ 26వతేదీన ములుగు (గజ్వేల్) మల్లక్కపేటలోని వీపీజే ఫంక్షన్ హాలులో జరుగుతుంది
మున్నూరుకాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ జిల్లా బాధ్యులు, జిల్లా అధ్యక్షులు గురువారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది
హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని రాజ్యసభ సభ్యులు,సంఘం గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో గురువారం అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్థార్ పుటం పురుషోత్తమ రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి మాజీ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా, కౌన్సిల్ సభ్యులు వీరమళ్ల ప్రకాష్,సీ.విఠల్,మీసాల చంద్రయ్య ఎర్రా నాగేంద్ర బాబు తదితర ప్రముఖులు హాజరయ్యారు
ఈ సందర్భంగా సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవలసిన చర్యల గురించి నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు
మున్నూరుకాపు ప్రముఖుల సమక్షంలో సంఘం రాజ్యాంగం మాదిరిగా రూపొందించుకున్న నియమావళి (బైలా)ని అనుసరించి క్రమశిక్షణ, అంకితభావంతో ముందుకు సాగుదామని… రాజకీయాలకు అతీతంగా మున్నూరుకాపులందరం మరింత ఐకమత్యతను చాటి చెప్పాలని సమావేశం నిర్ణయించింది
కాగా,సంఘం సంస్థాగత ఎన్నికలు వచ్చే ఏడాది మే మాసంలో ఉన్నందున,దాని కంటే ముందు వచ్చే నెల అక్టోబర్ 26న ములుగు (గజ్వేల్)లో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది
దీనిని దిగ్విజయం చేసేందుకు గాను జిల్లా బాధ్యులను అపెక్స్ కౌన్సిల్ నియమించి, ఇందుకు సంబంధించిన పత్రాలను వారికి అందజేసింది
బాధ్యులుగా నియమితులైన వాళ్లు ఆ యా జిల్లాలలో క్షేత్ర స్థాయిలో విస్త్రతంగా పర్యటించాల్సి ఉంటుంది
సంఘం జిల్లా కార్యవర్గం, అసెంబ్లీ నియోజకవర్గాల,మండల కో-ఆర్డినేటర్ లేదా మండల శాఖల అధ్యక్షులు, కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటూ మున్నూరుకాపు కులానికి చెందిన ఏంపీలు, ఏమ్మెల్సీలు,ఏమ్మెల్యేలు,మాజీ ఏంపీలు,మాజీ ఏమ్మెల్సీలు,మాజీ ఏమ్మెల్యేలు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులందరూ ములుగులో జరిగే స్టేట్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యే విధంగా ముందుకు సాగాలని బాధ్యులుగా నియమితులైన వారికి అపెక్స్ కౌన్సిల్ పలు సూచనలు చేసింది,సలహాలిచ్చింది
స్టేట్ కౌన్సిల్ మీటింగులో అపెక్స్ కౌన్సిల్ కు సేవలందించిన గంగుల కమలాకర్,అపెక్స్ కౌన్సిల్ గౌరవ ఛైర్మన్ గా నియమితులైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా నియమితులైన వద్దిరాజు రవిచంద్రలతో పాటు ఎంపీలు, ఏమ్మెల్సీలు, ఏమ్మెల్యేలను సన్మానిస్తారు
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సంఘం ప్రముఖులు బత్తుల సిద్ధేశ్వర్,ఆకుల గాంధీ,చల్లా హరిశంకర్, జుట్టు అశోక్,కూసం శ్రీనివాస్,కొత్తా లక్ష్మణ్,ఆవుల రామారావు,పుట్ట కిషోర్, గాజుల మహేందర్ ,వాసుదేవుల వెంకటేశ్వర్లు,బండి పద్మ,ఆర్వీ మహేందర్, వేల్పుల శ్రీనివాస్,ఉప్పు రవీందర్,పర్వతం సతీష్ తదితరులు పాల్గొన్నారు