వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో ఈనెల 11వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ వనపర్తి పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో నిర్వహించే భహిరంగ సభ హెలిపాడ్ ఏర్పాట్లు వనపర్తి ఎస్.పి శ్రీమతి రక్షిత కె మూర్తి పరిశీలించారు. హెలిపాడ్, సభాస్థలి ప్రాంగణం, గ్యాలరీల ఏర్పాటులు పరిశీలిం చారు
బందోస్తు కు సంబంధించి పోలీస్ అధికారులకు పలు సూచనలు జారీచేశారు . ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని, విధుల్లో ఉన్న పోలీసు అధికారుల సిబ్బంది సంయమానం పాటించాలనిపోలీస్ అధికారులకు సూచించారు. కేంద్ర హోం శాఖ మంత్రి పర్యటన సజావుగా అయ్యేటట్లు చూడాలని పోలీసు అధికారుల ను కోరారు ఎస్పీతో పాటు వనపర్తి అడిషనల్ ఎస్పీ ఏఆర్ శ్రీ వీరారెడ్డి డిఎస్పి శ్రీ వెంకటేశ్వరరావు , వనపర్తి సీఐ నాగభూషణం , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ ముని , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ అప్పలనాయుడు , స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు నరేష్ ,మల్లేష్ వనపర్తి టౌన్ ఎస్సై లు జయన్న రామరాజు జిల్లా పోలీస్ అధికారులు ఉన్నారు