తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, కార్పొరేట్ శక్తులకుఅనుకూలమైన బడ్జెట్ అని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. గురువారంచండూరు మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో( సిఐటియు, రైతు,కల్లుగీత కార్మిక సంఘం,చేతి వృత్తిదారుల సంఘం )కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్లోమోడీ ప్రభుత్వం ప్రజల మౌలిక అవసరాలకు కేటాయింపులు తగ్గించి,సంపన్నులకు రాయితీలు పెంచిందని, సామాన్య ప్రజలకు తీరని ద్రోహం చేసిందని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. దేశంలో200 మంది శతకోటీశ్వరులపై4 శాతం సంపద పన్ను ప్రవేశపెట్టాలని, కార్పొరేట్ పన్ను పెంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర హామీ కల్పించాలని ఆయన అన్నారు. భీమా రంగంలో100 శాతం ఎఫ్ డిఐ ఉపసంహరించాలని ఆయన అన్నారు.ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ,ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పగించడం ఆపాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 50 శాతంకేటాయింపులు పెంచాలని, పట్టణాలకు వర్తింపజేయాలని,ఆరోగ్య రంగానికి,విద్యారంగానికి జిడిపిలో3 శాతం చొప్పున కేటాయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆహార సబ్సిడీ పెంచాలని,ఎస్సీ ఎస్టిరంగాలకుమహిళ, శిశు సంక్షేమానికి కేటాయింపులు పెంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.స్కీం వర్కర్ల గౌరవ వేతనంతో కేంద్రం వాటాను పెంచాలని, రాష్ట్రాలకు నిధులబదిలీ పెంచాలని ఆయన అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులు,సర్ చార్జీలు రద్దు చేయాలనివారు అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రజల వ్యతిరేక బడ్జెట్ అని వెంటనే పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్లు ఆమోదించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులుమొగుధాల వెంకటేశం, చేతి వృత్తిదారుల సంఘం నాయకులు చిట్టి మల్ల లింగయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కత్తుల సైదులు, నల్లగంటి లింగస్వామి, గండూరు వెంకన్న, చినరాజు, కృష్ణయ్య, రమేష్, వెంకన్న, అన్నేపర్తి ఎల్లమ్మ, బక్కమ్మ, చంద్రమ్మ, అలివేలు, కలమ్మ, రేణుక, ముత్తమ్మ,రైతు సంఘం నాయకులుకొత్తపల్లి నరసింహ,వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.