Call to Uphold Ambedkar’s Ideals in Metpally
అంబేద్కర్ గారు కల్పించిన ఓటు హక్కును నిజాయితీగా ఉపయోగించడమే ఆయనకు నిజమైన నివాళి
ములుగు టౌన్ నేటి ధాత్రి
ములుగు జిల్లాలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలందరికీ ఎలాంటి విభేదాలు ధనికా, పేద, కులం, మతం, భాష, ప్రాంతం, స్త్రీ, పురుష, అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన ఓటు హక్కు కల్పించారని ఆ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీగా సమాజ కోసం ఉపయోగించుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం ప్రవీణ్ తెలియజేశారు
ములుగు జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ మాట్లాడుతూ ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగం నుండి ప్రతి ఒక్క సాధారణ పౌరుడికి ఏదైనా హక్కు లభించింది అంటే అది ఓటు హక్కు మాత్రమేనని ఆ హక్కును ఉపయోగించడం వల్లనే ఈ దేశంలో ఎంతో కొంత ప్రజాస్వామ్యం ముందుకు పోతుందని అన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కల్పించిన ఓటు హక్కును ఈ దేశంలో మెజారిటీ ప్రజలు దుర్వినియోగం చేస్తూ డబ్బులకు మద్యానికి కానుకలకు అమ్ముకొని ఓటు ను నిర్వీర్యం చేస్తున్నారని అలా చేయడం వల్లనే ఇంకా ఈ దేశం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోతుందని అన్నారు మొదట ప్రజలు వారి ఓటు హక్కును ఎలాంటి కానుకలకు అమ్ముకోకుండా నిజాయితీగా ఓటు వేసినప్పుడే రాజకీయాలలో రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుందని అన్నారు నోటుకు ఓటు వేయడం ద్వారా ఆ నోట్లతో కొన్న ఓట్లతో గెలిచి నోట్లు సంపాదించుకుంటున్నారు తప్ప దేశ ప్రజల జీవితాలను మాత్రం మార్చలేకపోతున్నారని అన్నారు ఓటు హక్కు అనేది ప్రతి ఒక్క పౌరుడికి ఉంటేనే ఈ దేశ ప్రజలందరిలో పేదరికం సాంఘిక అసమానతలు ఆర్థిక అసమానతలు లేకుండా పోవాలనే ఉద్దేశంతోనే అంబేద్కర్ గారు అంత గొప్ప అవకాశాన్ని ఆయుధాన్ని దేశ ప్రజలకు ఇచ్చినప్పటికీ ప్రజలు మాత్రం ఆ అవకాశాన్ని ఆయుధాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించడంలో నేటికీ విఫలం అవుతూనే ఉన్నారని అన్నారు ఇప్పటికైనా దేశంలో ఉన్న ప్రజలు యువత నోటుకు ఓటు కాకుండా నిజాయితీ ఓట్లతో నాయకులను ఎన్నుకుంటే ఆయా నాయకులు కూడా నిజాయితీగా పనిచేసి గ్రామం మండలం జిల్లా రాష్ట్రం దేశం అభివృద్ధిలో ముందుకు పోవడానికి కృషి చేస్తారని అన్నారు కానీ ఈ రోజుల్లో ప్రజలు ఓట్లు వేస్తే నాకేం వస్తుంది నాకు ఎంత ఇస్తారు ఓట్లు వేస్తాం అని అడుక్కునే దుస్థితి ఏర్పడిందని అన్నారు ఓటు హక్కు ఉన్నది అడుక్కోవడానికి కాదు నిజాయితీగా ఓటేసి గెలిచిన వాడిని గల్లాపాటి అభివృద్ధి ఏది అని అడగడానికి ఉందన్న విషయం మర్చిపోతున్నారు కాబట్టి ప్రజలందరూ యువకులందరూ ఓటు అనే హక్కును నీతి నిజాయితీగా ఉపయోగించుకోవాలని ఈ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారికి అదే నిజమైన నివాళి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు కోటపాక చంటి రాజ్యాంగ పరిరక్షణ సమితి నాయకులు జన్ను రవి రమేష్ సాంబయ్య రాములు కాకి అశోక్ తదితరులు పాల్గొన్నారు
