రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య
భూపాలపల్లి నేటిధాత్రి
ఆదివాసీ హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన గిరిజనుల ఆరాధ్య దైవం కొమురం భీమ్ అని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య అన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు అరకొండ రాజయ్య అద్యక్షతన కొమురం భీం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య హాజరై మాట్లాడారు. ఆదివాసీ హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన వీరుడన్నారు. గిరిజనుల లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశారని తెలిపారు. నిజాం నవాబు సాగించిన దోపిడీ దౌర్జన్యాలను ఎదిరించి వీరోచితంగా పోరాడారని, ఆదివాసీ ల గురించి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప గిరిజన నాయకుడిని తెలిపారు. జల్ -జంగిల్ -జమీన్ అని నినదించి ఆదివాసీ ల హుక్కులు సమస్యలు పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన గిరిజనుల నాయకుడన్నారు . ఆదివాసీ ల గురించి కొమురం భీం చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మారపెల్లి కొంరయ్య జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ మండల గౌరవ అధ్యక్షుడు నేరేళ్ళ రామకృష్ణ గౌడ్ మండల ఉపాద్యక్షులు మాడుగుల వీరయ్య మండల సహాయ కార్యదర్శి కనుమరుగుల కొంరయ్య రాకేష్ తదితరులు పాల్గొన్నారు
