
ఘనంగా బిర్సాముండా 149 వ జయంతి వేడుకలు
పాల్గొన్న శ్రీ రామకృష్ణసేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేశ్
మంగపేట నేటిధాత్రి
మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామం లో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో భగవాన్ బిర్శా ముండా 149 వ జయంతి వేడుకలు ప్రఖండ ప్రముఖ్ చౌలం సాయిబాబు అద్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ ,జిల్లా మహిళ నాయకురాలు కొమరం ధనలక్ష్మి పాల్గోని బీర్సా ముండా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకం గా ఆనాడు ఎన్నో ఉద్యమాలు చేపట్టాడని,స్వాతంత్ర సమరయోధుడని,బిర్సా ముండా గిరిజనుల పాలిట దైవం గా బావిస్తారని , బిర్సా ముండా 1875 నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఉలిహతులో జన్మించారని,గిరిజన మత సహస్రాబ్ది ఉద్యమానికి నాయకత్వం వహించారని,అలాగే గిరిజన సమాజంలో ప్రబలంగా ఉన్న మూఢనమ్మకాలను తొలగించే ప్రచారాన్ని చేపట్టారని, భూస్వాముల ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారని,
1894లో బిర్సా ముండా ఆదాయ మాఫీ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారనీ,ఈ ఉద్యమాన్ని ముండా తిరుగుబాటు లేదా ఉల్గులన్ అని పిలుస్తారని,
1895లో బ్రిటీష్ వారు బిర్సా ముండాను అరెస్టు చేశారని,జైలు నుండి విడుదలైన తర్వాత బిర్సా ముండా బ్రిటిష్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా గిరిజన సమాజాన్ని ఏకీకృతం చేశారనీ,1899, డిసెంబరు 24న బిర్సా ముండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించారని ఆయన ఘనత ను ఈ సందర్భం గా కొనియాడారు.అనంతరం
స్కూల్ పిల్లలకు పెన్నులు ,పలకలు నోట్ బుక్స్ అందజేయడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో శ్రద్దా జాగరణ జిల్లా ప్రముఖు మడకం రాజేష్ ,కొమరం శివాజీ,గట్టిపల్లి అర్జున్ ,చౌలం నవీన్,సున్నం సురేష్,చౌలం సింధూ,మడకం నర్సయ్య గ్రామ పెద్దలు సున్నం భుజంగరావు,బొగ్గుల కృష్ణమూర్తి,గట్టిపల్లిరత్తమ్మ,సున్నం నాగమ్మ,శ్రీరామకృష్ణసేవాట్రస్ట్ సభ్యులు గుమ్ముల వీరాస్వామి,మునిగేల నరేష్ ,ఇందారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు