సంవత్సరాల నుండి మల్కాజిగిరి టౌన్ ప్లానింగ్ లో స్థిరపడ్డా టిపిఓ…
అక్రమార్కులకు సలహాలు సూచనలు ఇచ్చి పనికానిస్తున్న అధికారులు…
మల్కాజిగిరి,నేటిధాత్రి:
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ఆరు డివిజన్ లలో విచ్చలవిడిగా కండ్లకు కనపడేటట్టు,ఎటువంటి నిబంధనలు పాటించకుండా, అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు జరుగుతున్న, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్న. టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూస్తా పాపాన పోలేదు. అక్రమార్కులు టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఉన్న అధికారులను మేనేజ్ చేసుకొని అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలను ఏదేచ్ఛగా కడుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఎన్నో సంవత్సరాల నుండి టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో స్థిరపడ్డ కొంతమంది అధికారులు ఉన్నత అధికారులు,ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై అక్రమార్కుల నుండి పెద్ద మొత్తంలో ఆమ్ ఆమ్యాలు అందుకొని ఎవరి వాటాలు వారికి పంచుతూ యదేచ్చగా అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారు.నోటరీ స్థలాలలో వాణిజ్య భవనాలు నిర్మిస్తున్న, అనుమతులు పరిమితికి మించి అధికంగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్న, ఎవరిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలో సలహాలు సూచనలిస్తూ అక్రమార్కుల పనులు ఏదేచ్ఛగా జరిగేటట్టు జాగ్రత్త పడుతున్నారు. అక్రమంగా కట్టడాలు జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమార్కులకు పరదలు కట్టికోని, సున్నాలు వేసుకుని నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఐడియాలు ఇస్తూ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అక్రమార్కులను అడ్డుకట్టు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.