
water problem
గొంతు ఎండిపోతుంది….!!! పట్టించుకోలేని అధికారులు…!!!
జహీరాబాద్ నేటి ధాత్రి:
అసలే వర్షాకాలం … ఓ వైపు వర్షాకాలం ఉండడం… మరోవైపు గొంతు ఎండిపోతుంది… గొంతు తడుపుకోవడానికి కనీసం తాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండలంలోని మేడపల్లి పంచాయతీ గ్రామంలో పరిస్థితి ఇది. తాగునీటి కోసం గ్రామస్తులు ఇక్కట్లు పడుతున్నారు. కిలో మీటరు దూరంలో గల బోరు బావుల వద్ద నీరు తెచ్చుకుంటున్నారు ఎంటి ఈ పరిస్థితి మాకు అని ఆవేదన చెందుతున్నారు.గ్రామంలో మూడు మూడు బోర్ లు ఉన్నా వాటిని మరమ్మత్తు చేసే శక్తి అధికారులకు లేదా అని ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలంలో నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. తాగునీటి సౌకర్యాలు అరకొరగా అందుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన కుళాయిలను కూడా సద్వినియోగం చేసే అధికారులు లేరు .అంతంత మాత్రంగానే ఉంది. దీంతోగ్రామంలో 200 పైగా కుటుంబాలు ఉన్నాయి. గ్రామస్తులకు మాత్రం సరైన నీరు లేక నాన్న తిప్పలు పడుతున్నారు.గ్రామంలో గత వారం పది రోజులుగా తీవ్ర తాగు నీటి సమస్యతో బాధపడుతున్న గ్రామ ప్రజలు వారం రోజులుగా అధికారులకు విన్నవించుకుంటున్న పట్టించుకోడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు