IT Officer Tricked in Cyber Scam
ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌నే బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..
ఏమి కావాలన్నా చెల్లింపులన్నీ మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి. కావాల్సిన వస్తువు ఇంటికే వచ్చేస్తోంది. అదే సమయంలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ కేటుగాళ్లు అమాయకులకు వల వేసి వారి ఖాతాల్లోని నగదును సునాయాసంగా కాజేస్తున్నారు
ప్రస్తుత డిజిటల్ యుగంలో అన్నీ మొబైల్ ఫోన్ ద్వారానే జరిగిపోతున్నాయి. ఏమి కావాలన్నా చెల్లింపులన్నీ మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి. కావాల్సిన వస్తువు ఇంటికే వచ్చేస్తోంది. అదే సమయంలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ కేటుగాళ్లు అమాయకులకు వల వేసి వారి ఖాతాల్లోని నగదును సునాయాసంగా కాజేస్తున్నారు
తాజాగా సైబర్ కేటుగాళ్లు ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌నే బురిడీ కొట్టించారు. వెబ్సైట్ నుంచి ఇన్కమ్ టాక్స్ కమిషనర్ వైన్ ఆర్డర్ చేశారు. గూగుల్ పే ద్వారా మొదట రూ. 2,320 చెల్లింపు చేశారు. అనంతరం హోమ్ డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉందని, డబ్బులు చెల్లిస్తే ఇంటికే డెలివరీ చేస్తామని మరో స్కానర్ పంపారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆ స్కానర్‌ను స్కాన్ చేసిన వెంటనే అతడి ఖాతా నుంచి రూ.40 వేలు డెబిట్ అయిపోయాయి (cyber crime incident). దీంతో ఆ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ షాకయ్యారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
