మరిపెడ నేటిధాత్రి.
మంగళవారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ లోని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో భార్గవ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రిస్మస్ వేడుకలకు డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ ముఖ్య అతిథిగా హాజరై
పాస్టర్లలతో కలిసి క్రిస్మస్ వేడుకల కేక్ కట్ చేసి,పాస్టర్ లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఏసు బోధనలు ఒక మతానికి సంబంధించినవి కావని యావత్తు మానవాళికి మార్గదర్శకత్వం చేసేవి అని తెలిపారు. ఏసుక్రీస్తు మనుషులను
అందరిని ప్రేమించాలి, మార్గంలో నడవాలి, సేవా భావంతో మెలగాలని అన్న క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ప్రపంచానికి బోధించిన శాంతి దూత యేసు అని అన్నారు.క్రిస్టియన్ మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.
దేశంలో సర్వ మతాలకు రక్షణ కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.గతంలో ఎన్నడు లేని విధంగా చర్చిల నిర్మాణానికి మరమ్మత్తులు ఆధురనీకరణకు, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు, క్రైస్తవుల సంక్షేమం కోసం తన వంతు పూర్తి సహకారం ఉంటుందని ఏ ఆపద వచ్చిన అండగా ఉంటానని చెప్పారు,ప్రజలకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. తెలియజేశారు.
కరుణను ఆచరాత్మకంగా చూపించిన వ్యక్తి ఏసుక్రీస్తు అని కొనియాడారు.
సోదరాభావం వినయ కరుణతో సంతోషంగా మనమందరం జీవించవచ్చున్నారు, అనంతరం ఏర్పాటు చేసిన విందులో ప్రభుత్వ విప్ పాల్గొన్ని బోజనము చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ గణేష్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ మరిపెడ తహసిల్దార్ సైదులు, ఎంపీడీవో విజయ, పాస్టర్స్ భాస్కర్, రామ్మూర్తి, మహేందర్, ఉప్పల వెంకటేశ్వర్లు, దేవరాజు, ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ నాయకులు వంటి కొమ్ము యుగంధర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి,కాలం రవీందర్ రెడ్డి, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు,రామ్ లాల్, అంబరీష, అప్సర్, తదితరులు పాల్గొన్నారు.