
ఉపాధ్యాయుడే మార్గదర్శకుడు
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర
గంగాధర మండలం మధురానగర్ లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే
గంగాధర నేటిధాత్రి :
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గంగాధర మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల స్థాయిలో ఎంపికైన 22 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేసే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.