ముదురు పాకాన పడిన తమిళ భాషా వివాదం

ముదురు పాకాన పడిన తమిళ భాషా వివాదం

రాష్ట్ర బడ్జెట్‌ లోగోలో హిందీ ‘రు’ గుర్తును తొలగించిన డి.ఎం.కె. ప్రభుత్వం

తమిళ ‘రూబాయి’లోని తొలి అక్షరాన్ని లోగో కింద వుంచిన వైనం

ఎన్‌ఈపీా2020పై వ్యతిరేకతను భాషా వివాదంగా మలచిన డి.ఎం.కె

డీలిమిటేషన్‌ సమస్యను కూడా ముందుకు తెస్తున్న పార్టీ

హద్దులు లేకుండా మాట్లాడటం, కేంద్రాన్ని నిందించడం

ఇదీ ద్రవిడ పార్టీ వైఖరి

ఓట్లకోసమే భావోద్వేగాలను రెచ్చగొడుతున్న డి.ఎం.కె.

అనుసంధాన భాషపై అనవసర వివాదం

కేవలం తమిళం మాత్రమే నేర్చుకుంటే నష్టపోయేది ప్రజలే

రాజకీయ లబ్దికోసం భాషా అస్త్రాన్ని వాడుతున్న డీఎంకే

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తమిళనాడులో భాషా వివాదం ముదిరి పాకానపడిరది. జాతీయ విద్యావిధానం`2020లో పేర్కొన్న త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్న డి.ఎం.కె. ప్రభుత్వం దీన్ని పెద్ద వివాదంగా మలచి, వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దిపొందాలన్న ఉద్దేశంతో ముందుకెళుతోందని, అది తీసుకుంటున్న చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో భాజపా ‘సనాతన ధర్మం’ అస్త్రం తో తనను ఎదుర్కొంటుండటంతో ద్రవిడవాద డి.ఎం.కె. దిగ్గజం ఇందుకు ప్రతిగా తన సత్తా ఏంటో చూపాలన్న దృష్టితో భాషావివాదాన్ని రెచ్చగొడుతోంది. ఈ ‘భాషా దురభిమానం పిచ్చి’ ఎంతగా ముదిరిపోయిందంటే, ఏకంగా రూపాయి నోటుపై హిందీ అక్షరం ‘ఆర్‌’ను తొలగించి దాని స్థానంలో తమిళ ‘ఆర్‌’ అక్షరం పెట్టేవరకు వెళ్లింది. దీంతో తమిళ రాజకీయాలు మళ్లీ వేడె క్కాయి. రాష్ట్ర ఆర్థికమంత్రి తంగం తిన్నెరసు 2025`26 బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి వుంది. ఈ బడ్జెట్‌కు సంబంధించిన లోగోలో మొట్టమొదటి అక్షరంగా తమిళ భాషకు చెందిన ‘రూబాయి’లోని మొదటి అక్షరం ‘రు’ను వుంచడం ఇప్పుడు దుమారం రేపింది. ఈ లోగోపై ‘అందరికీ అన్నీ’ అనే శీర్షికను వుంచారు. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లే డి.ఎం.కె విధానాన్ని ఇది తెలియజేస్తుంది.
దీంతో రాష్ట్ర బీజేపీ ఒక్కసారిగా డి.ఎం.కె. చర్యపై మండిపడిరది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నా మలై తీవ్రంగా స్పందిస్తూ ‘‘ ఒక తమిళుడు రూపొందించిన హిందీ అక్షరం ‘రు’ డిజైన్‌ను తొల గించడం దారుణం. దేశం మొత్తం ఆమోదించి అనువర్తింపజేసుకున్న డిజైన్‌ ఇది. అంతేకాదు మన కరెన్సీకి గుర్తుగా ఈ డిజైన్‌ను ఉపయోగిస్తున్న సంగతిని తెలుసుకోవాలి’’ అంటూ ఎక్స్‌ కాతాలో పోస్ట్‌ చేశారు. ‘తిరు ఉదయ్‌కుమార్‌ ఈ డిజైన్‌ను రూపొందించారు. ఈయన మాజీ డి. ఎం.కె. ఎమ్మెల్యే కుమారుడు. ఇటువంటి చిహ్నాని తొలగించి మూర్ఖంగా వ్యవహరించారు తిరు స్టాలిన్‌’ అంటూ ఆయన తన పోస్ట్‌లో ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో 2024`25 తమిళనా డు బడ్జెట్‌ లోగోగా హిందీ ‘రు’ డిజైన్‌ను ఉపయోగించిన ఫోటోను కూడా పోస్ట్‌ చేశారు.
దీనిపై తమిళనాడు ప్రభుత్వం ఇంకా స్పందించలేదు కానీ భాజపా మాత్రం స్టాలిన్‌ ప్రభుత్వ చ ర్యపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అసలు తమిళపార్టీ దేశం కంటే తాను భిన్నమన్న రీతిలో వ్యవహరిస్తోందంటూ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
జాతీయ విద్యావిధానం`2020 కింద త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి తమిళనాడు ప్ర భుత్వం ముందుకు రాకపోవడంతో, ‘సమగ్ర శిక్షా అభియాన్‌’ కింద రాష్ట్రానికి కేటాయించిన రూ.573కోట్ల ను తొక్కిపట్టింది. దీంతో కేంద్రం, రాష్ట్రం మధ్య వివాదం రాజుకుంది. ఈ విద్యా విధానం కింద రాష్ట్రాలు సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) నిధులు పొందాలంటే జాతీయ విద్యావిధానంలో నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించడం తప్పనిసరి. ఎస్‌ఎస్‌ఏ కింద కేం ద్రం తమిళనాడు వంటి రాష్ట్రాలకు 60శాతం నిధులు సమకూరిస్తే మిగిలిన 40శాతం రాష్ట్రం భరించాల్సివుంటుంది. ‘ప్రధానమంత్రి శ్రీ పథకం’ కింద సంబంధిత రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందంపై సంతకం చేయాల్సి వుంటుంది. అప్పుడు మాత్రమే కేంద్రం ఎన్‌ఈపీ`2020 కింద నిధులు విడుదల చేస్తుంది.
ఈ వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వడమే కాకుండా అందుకు నాయకత్వం వహించారు కూడా. నూతన జాతీయ విద్యా విధానం కేవలం ‘కాషాయ విధానం’ మాత్రమేనని విమర్శించారు. హిందీని రుద్దడంపై వున్న శ్రద్ధ దేశాభివృద్ధిపై లేదన్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన ‘కత్తి’ దక్షిణాది రా ష్ట్రాల నెత్తిన వేలాడుతున్నదంటూ గుర్తుచేశారు. ‘మేం జాతీయ విద్యావిధానాన్ని పూర్తిగా వ్యతిరే కిస్తున్నాం. ఇది సామాజిక న్యాయం కింద రిజర్వేషన్లను ఆమోదించదు. షెడ్యూల్డు కులాలు/తెగ లు, వెనుకబడిన వర్గాల వారికి విద్యకోసం తగిన ఆర్థిక సహాయాన్ని అందించడానికి కూడా ఇది దోహదం చేయదని ఒక బహిరంగ ర్యాలీలో ఆరోపించారు. జాతీయ విద్యావిధానంలోని త్రిభా షా సూత్రం కేవలం హిందీని బలవంతంగా రుద్దడానికి ఉద్దేశించేందనన్నారు. ఎన్‌ఈపీ వంటి కొన్ని పథకాల అమలుకు నిధులు కేటాయించబోమని కేంద్రం చెప్పడం కంటే అరాచకం మరో టి వుండదన్నారు. తమిళనాడు త్రిభాషా సూత్రాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కేవలం ద్విభాషా సూత్రాన్ని మాత్రమే అమలుచేస్తుందని కుండబద్దలు కొట్టారు.
‘ప్రధానమంత్రి మోదీగారూ! మాదో విన్నపం. హిందీకంటే దేశాభివృద్ధిపై దృష్టిపెట్టండి. ఎవ్వరూ మాట్లాడని సంస్కృత భాషాభివృద్ధికోసం కోట్ల రూపాయలు కుమ్మరించిన ఫలితముండదు. దేశ విదేశాల్లో తమిళ భాషను మాట్లాడుతున్న ప్రజలను మోసం చేయకండి’ అన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్‌ ఇటీవల మాట్లాడుతూ ‘డి.ఎం.కె. రాబోయే ఎన్నికల్లో ఏదోవిధంగా అధికారంలోకి రావడానికి మాత్రమే ఎన్‌ఈపీని వివాదం చేస్తోంది. తమిళభాష విషయంలో వారు ప్రదర్శిస్తు న్న అత్యుత్సాహం కేవలం కపటనాటకం మాత్రమే’ అని వ్యాఖ్యానించడం డీఎంకే అధినేత స్టాలిన్‌ ఇంతటి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేయడానికి కారణం. తమిళ ప్రజలకు ప్రజాస్వామ్య మంటే ఏమిటో చెప్పాల్సిన అవసరం కేంద్రమంత్రికి లేదని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.
ఇక నియోజకవర్గాల పునర్విభజనపై కూడా స్టాలిన్‌ మండిపడ్డారు. ఉత్తరాదిలో బలీయంగా వు న్న కాషాయపార్టీ, ఈ పునర్విభజన కారణంగా ఆ ప్రాంతంలో పెరిగే సీట్ల ద్వారా రాజకీయంగా లబ్దిపొందడమే కాదు, కేవలం ఉత్తరభారతదేశ ఓట్లతోనే అధికారంలో కొనసాగాలని భావిస్తోంది. ఇది చాలా ఘోరం. పునర్విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం ప్రయత్నిస్తే డీఎంకే తప్పకుండా దాన్ని అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. బీజేపీ కుట్రను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒడిషా, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లోని 29 పార్టీలకు లేఖలు రాశానన్నారు. ఈ పార్టీలన్నీ ఈనెల 22న చెన్నైలో పునర్విభజనపై చర్చలు జరుపను న్నాయి. రాష్ట్రంలో విద్యావిధానం పూర్తిగా విఫలమైంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికే డి.ఎం.కె. ప్రభుత్వం ఈ భాషా వివాదాన్ని ముందుకు తెచ్చిందంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామలై ఆరోపించారు. వినాశకర విధానాలను అనుసరిస్తూ, విద్యావిధానాన్ని డి.ఎం.కె. ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందన్నారు.
జాతీయ విద్యావిధానంతో పాటు, నియోజకవర్గాల పునర్విభజన అంశం కొద్దివారాలుగా కేంద్రం, తమిళనాడు రాష్ట్రాల మధ్య సంఘర్షణాత్మకతను పెంచుతోంది తప్ప నివారించడంలేదు. బీజేపీ దేశవ్యాప్తంగా తన జాతీయవాద నినాదంతో ముందుకెళుతూ, ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌’ అభివృద్ధికి అవసరమని ప్రచారం చేస్తుండటాన్ని, ప్రాంతీయ పార్టీలు అధికారంలో వున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలు ఆమోదించడంలేదు. ఎందుకంటే ఏదోవిధమైన భావోద్వేగ అంశాలను ముందుకు తెచ్చి ఇవి తమ అధికారాలను కాపాడుకుంటుండటమే అందుకు కారణం. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా దేశ వ్యాప్తంగా ఒకే విద్యావిధానం అమలు కావాలనే కోరతాయి. ఇది దేశ ఐక్యతకు చాలా ముఖ్యం. దీనికితోడు త్రిభాషా విధానంపై డి.ఎం.కె. ఎంపీలు పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు ఎంతమాత్రం బాగాలేదు. సభా మర్యాదను కూడా పట్టించుకోని రీతిలో వారు తమ వ్యతిరేకతను వెల్లడిరచారు. విచిత్రమేమంటే స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో కంటే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉద్యోగార్థులు దేశంలోని ఎక్కడి కైనా వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి! ఈ నేపథ్యంలో హిందీ రావడం తప్పనిసరి! ఇంగ్లీషు భాష ఉత్తర భారతదేశంలో సామాన్యులకు రాదు కదా! నిజంగా దేశాన్ని ఐక్యంగా వుంచాలన్నా, అభివృద్ధిలో ప్రతి రాష్ట్రం భాగస్వామ్యం కావాలన్నా దేశవ్యాప్తంగా ఒక అనుసంధాన భాష తప్పనిసరి! ఇది డి.ఎం.కె.కు తెలియంది కాదు. అదీకాకుండా మనదేశ భాష కాని ఇంగ్లీషును ఒకపక్క ఆమోదిస్తూ, హిందీని వ్యతిరేకించడం…ఇదెక్కడి భాషాభిమానం? దేశీయ భాషను వ్యతిరేకించి, విదేశీ భాషను ఆమోదించడం…ఇదెక్కడి వింత? ఇది అవకాశవాద రాజకీయం తప్ప మరోటికాదు. కానీ భావోద్వేగాలను ఎంతగా రెచ్చగొడితే అంతగా ఓట్లు రాలతాయి. ఇదీ డీఎంకే నేతల ఓవర్‌ యాక్షన్‌ వెనుక వున్న ఆంతర్యం. సమాఖ్య వ్యవస్థను భ్రష్టుపట్టించేది వీరే…కేంద్రాన్ని ఆడిపోసుకునేదీ వీరే. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, తమ స్వలాభంకోసం ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి కూడా వెనుకాడని ఇటువంటి ప్రాంతీయ పార్టీలు దేశాభివృద్ధి గురించి మాట్లాడటం వింతల్లోకెల్లా వింత. అయినకాడికి ఉచితాల పేరుతో రాష్ట్రాల ఖజానాను ఖాళీచేస్తూ, ప్రజలను బద్ధకస్తులుగా మార్చడమే కాదు, అభివృద్ధికి దోహదం చేయని ఈ పార్టీలు దేశాభివృద్ధి గురించి మాట్లాడటం విచిత్రం! దేశాభివృద్ధి లక్ష్యంతో పనిచేసే పార్టీలు ఇటువంటి సంకుచిత ధోరణులను ప్రదర్శించవు. ఈ సత్యాన్ని విజ్ఞులైన ప్రజలు తప్పక గుర్తిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!