పరకాల ముదిరాజుల మద్దతు చల్లాకే

మేమంతా మీవేంటే

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చల్లా ధర్మారెడ్డ

పరకాల నేటిధాత్రి
పరకాల బి.ఆర్.ఎస్.పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కే తమ పూర్తి మద్దతు తెలుపుతూ,వారి గెలుపుకు కృషి చేస్తామని పరకాల ముదిరాజ్ సంఘం నాయకులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో ముదిరాజ్ సంఘం సొసైటీ అధ్యక్షులు బోయిని రాజేష్,ఉపాధ్యక్షులు గొడుగు కుమారస్వామి,ప్రధాన కార్యదర్శి గొడుగు నాగరాజు,డైరెక్టర్లు బస్కురి అయి,అల్లే రాజు,యాట రమేష్,సాదు చిన్న నర్సయ్య,సురుగురి చిన్న సమ్మయ్య,పాని,సమ్మయ్య, ఆల్లే రమేష్,దామ సతీష్,బోయిని చేరాలు,సాదు రాజు,దామ అశోక్,అయిలయ్య లతో పాటు 100 మందికి పైగా బి.ఆర్.ఎస్.లో చేరారు.వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాపై,పార్టీపై నమ్మకంతో పార్టీలో చేరిన ముదిరాజ్ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ముదిరాజు కులస్థుల అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషిచేశారని అన్నారు.కనుమరుగవుతున్న కుల వృత్తులను ప్రోత్సహించి వారి అభివృద్ధికి బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఎంతో తోడ్పాటు చేసిందన్నారు.పనిచేసే పార్టీనే పట్టం కట్టాలని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెబోయిన అశోక్,సోదా రామక్రిష్ణ, రేగురి విజయపాల్ రెడ్డి,మార్కెట్ చైర్మన్ నిప్పాని సత్యనారాయణ,బండి శ్రీధర్,దామ అనిల్,బండారి జైపాల్,గొడుగు నాగరాజు, బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!