
టూ ది సబ్ రిజిస్టర్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అంటున్న సబ్ రిజిస్టర్
మండల రెవెన్యూ సర్వేయర్ తో సర్వే చేసి ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తాం అంటున్న జిల్లా రిజిస్టర్
గంగాధర నేటిధాత్రి :
గ్రామ పంచాయతీలకు సంబదించిన రిజిస్ట్రేషన్ లు చేయడం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రజలు ఇంటి నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకొని బ్యాంకు లోన్ తీసుకుందాం అంటే రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం కలెక్టర్ ఇచ్చినా ఆదేశాలతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు మొఖ పరిశీలన చేసి ఇంటి విస్తీర్ణం, భూమి విస్తీర్ణం మరియు హద్దులు దృవీకరణ చేసి ఇస్తున్నారు. కానీ గంగాధర సబ్ రిజిస్టర్ ఈవిధంగా ఉంటే రిజిస్ట్రేషన్ చేయను అని చెప్తున్నారు. సబ్ రిజిస్టర్ ను ఏవిదంగా ఉంటే చేస్తారని వివరణ కోరగా టూ ది సబ్ రిజిస్టర్ కు అని రాసి ఇంటి విస్తీర్ణం మరియు భూమి విస్తీర్ణం రాసి ఇస్తే చేస్తాను అని చెప్పడం జరిగింది. సబ్ రిజిస్టర్ తెలిపిన వివరాలపై జిల్లా రిజిస్టర్ ను వివరణ కోరగా మండల రెవెన్యూ సర్వేయర్ సర్వే చేసిన లెటర్ పై గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం చేసి ఇస్తే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేస్తారు అని వివరణ ఇవ్వడం జరిగింది.