
16వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి ;
అంగన్వాడీ ఉద్యోగుల పర్మినెంట్ కనీస వేతనాలు, గ్రాడ్యుటి, తదితర సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శిబొట్టు శివకుమార్ అన్నారు.
మంగళవారం అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె 16 వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకుకెవిపిఎస్ తరఫునపూర్తిగా మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చి సమ్మె చేస్తున్నా అంగన్వాడీ ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడుతూ సమ్మెను విచ్చిన్నం చేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం పోరాడే సంఘాలను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని లేనియెడల సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్, కనీస వేతనం, గ్రాడ్యుటి, ఈఎస్ఐ,పిఎఫ్ ,సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు, అంగన్వాడి ఉద్యోగులను మోసం చేస్తూ ఐసిడిఎస్ మంత్రి హామీలుఉన్నాయని వారన్నారు., మంత్రి హామీలు సమస్యలను పరిష్కారం చేయకపోగా మరింత అసంతృప్తిని పెంచిందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ,పెన్షన్ పెంపు తదితర ముఖ్యమైన డిమాండ్స్ ను ఏవి కూడా ప్రస్తావించకుండా ఆ డిమాండ్స్ ను పక్కకు పెట్టి కేవలం చనిపోయిన తర్వాత ధహన సంస్కారాలు నిర్వహించడానికి టీచర్లకు 20,000 ఆయాలకు 10,000 ప్రభుత్వ నిర్ణయం చేయడం దుర్మార్గమైన నిర్ణయం అని అన్నారు. టీచర్లకు ఆయాలకు చావులో డబ్బులు వ్యత్యాసం చూపించడం మానవత్వం లేని చర్యాని అన్నారు. మోసపూరిత విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో ఉన్న జేఏసీ సంఘాన్ని సిఐటియు ఏఐటియుసిని చర్చలకు పిలిచి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనియెడల సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులుజెర్రిపోతుల ధనంజయ గౌడ్,ఏఐటీయూసీజిల్లా ఉపాధ్యక్షులుదోటి వెంకన్న,సిఐటియు సీనియర్ నాయకులుమొగుదాల వెంకన్న,అంగన్వాడి వర్కర్స్,హెల్పర్స్ యూనియన్ నాయకులు , కే దారి, సత్తమ్మ, నాగమణి, రమణమ్మ, సునీత, జగదీశ్వరి, తారక,జ్యోతి,మంగమ్మ,శోభ,పద్మ,విజయనిర్మల,వనజాత,రాజేశ్వరి,భాగ్యలక్ష్మి, పార్వతమ్మ, వెంకటమ్మ,,, ఆయాలుసుగుణమ్మ,సుజన,సోనీ,సాయమ్మ,రాణి,నిర్మలమ్మ, అండాలుతదితరులు పాల్గొన్నారు. .