కార్మిక నాయకులకు నిమ్మరసం అందజేసిన ఏఐటియుసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో సివిల్ సప్లై హమాలీ కార్మికులు 1జనవరిన చేపట్టిన నిరవధిక సమ్మెను ఏఐటీయూసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసరి అశోక్ కార్మికులకు నిమ్మరసం అందించి సమ్మెను విరమణ చేయించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగ సివిల్ సప్లై హమాలీ కార్మికులు తమయొక్క వేతనని 26నుండి 29రూపాలను పెంచాలని ఏడు రోజులు గా నిరవదిక సమ్మె కొనసాగిందని రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పెంచిన వేతనాన్ని రెండు రోజుల్లో అమలుపరిచే విధంగా చూస్తానని చెప్పినందుకు గాను ఏఐటియుసీ పక్షాన మంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వనికి ధన్యవాదాలు తెలిపారు.నాయకులు స్పందించడం హమాలీ కార్మికుల విజయమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో మచ్చ శంకర్,మచ్చ సందీప్,గడ్డం సురేష్,బొచ్చు శంకర్,కొమ్ముల మహేందర్,బొచ్చు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.