
Mandal Education Officer Hanumantha Rao congratulated.
ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలని ఒగ్గు కథ
ప్రధానోపాధ్యాయులు -అచ్చ సుదర్శన్
నడికూడ,నేటిధాత్రి:
కథలు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరని ముఖ్యంగా ఒగ్గు కథలంటే తెలంగాణ ప్రజలకు చాలా ఇష్టమని తెలుసుకున్న నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు నర్ర సతీష్ యాదవ్ బృందం చే ఒగ్గు కథ పాట ను ఆదివారం రోజున చెప్పించడం జరిగింది.నర్ర సతీష్ యాదవ్ సామాన్య జనాల మనసుకు అతుక్కు పోయే విధంగా ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రత్యేకతలను ఒగ్గు కథ రూపంలో వివరించడం జరిగింది.అదేవిధంగా చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించాలని,ఆ పాఠశాల యొక్క ప్రత్యేకతలను తల్లిదండ్రులకు ఒగ్గు కథ పాట ద్వారా తెలియచేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఒగ్గు కథ పాట ఉపాధ్యాయ గ్రూపులలో మరియు గ్రామాల గ్రూపు లలో వాట్సాప్ లో చెక్కర్లు కొడుతున్నది.సామాజిక మాధ్యమాల ద్వారా బడిబాటను ప్రచారం చేస్తున్న చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయ బృందమును, ఒగ్గుకథ కళాకారుడు నర్ర సతీష్ యాదవ్ ను మరియు అతని బృందాన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేస్తున్న కృషిని నడికూడ మండల విద్యాశాఖ అధికారి హనుమంతరావు అభినందించారు.