Ammavari Vigraham Emerges in Ramakrishnapur
పట్టణంలో వెలిసిన అమ్మవారి విగ్రహం….
రామకృష్ణాపూర్,నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కే వన్ మోరీ ఏరియాలో గల బతుకమ్మ ఘాట్ సమీపంలో అమ్మ వారి విగ్రహం వెలిసింది.గత ఏడాది క్రితం నుండి ఈ ప్రాంతంలో అమ్మవారు ఉన్నట్లు మహిళ భక్తురాలు చెప్తున్నట్లు స్థానికులు అంటున్నారు. శుక్రవారం అమ్మ వారి భక్తురాలు దుర్గా మాతను నెలకొల్పే ప్రాంతంలో అమ్మవారు ఉన్నట్లు తెలుపడంతో స్థానికులు, పూజారి గోల సాయినాథ్ వెళ్ళి చూడగా అమ్మవారి విగ్రహం ప్రత్యక్షమై వెలసినట్లు తెలుపుతున్నారు.అమ్మవారి విగ్రహం వెలువడంతో పట్టణంలోని ప్రజలు విగ్రహాన్ని తిలకించేందుకు భారీగా తరలి వచ్చారు. అనంతరం పూజారి గోల సాయినాథ్ మాట్లాడారు. లోక కళ్యాణార్థం అమ్మవారు ఈ ప్రాంతంలో వెలిశారని,అమ్మవారికి గుడి నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరుతున్నారు. గుడి నిర్మించి పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం పట్టణంలోని ప్రతి ఒక్కరిపై ఉంటుందని తెలిపారు. స్థానిక నాయకులు కంబగౌని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ… త్వరలోనే పురోహితుల సమక్షంలో అమ్మవారి గుడిని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించేలా చొరవ తీసుకుంటామని అన్నారు.
