Midday Meal Workers Demand Pending Wages and Hike in Meal Charges
మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమ దోసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం…
చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్న కార్మికులు
భూపాలపల్లి నేటిధాత్రి
రెండు నెలలుగా వంట చేస్తున్న బిల్లులు రాని పరిస్థితి సమస్యలను పరిష్కరించాలనిడిమాండ్ చేస్తున్న సిపిఐ ఎంఎల్ పార్టీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రామ్ రామ్ చందర్ మాదిగ
స్కూల్స్ ను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
టేకుమట్ల… మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక స్కూల్… జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల లో చదువుతున్న పిల్లలకు వంట చేస్తున్న కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది మధ్యాహ్న భోజన కార్మికులు రెండు నెలలుగా వంట చేస్తున్న వారికి బిల్లులు రాక వారి గౌరవ వేతనం రాక చాలా ఇబ్బంది పడుతున్నారు తక్షణమే గౌరవ వేతనం 3000 ఇస్తున్నారు 15000 రూపాయలు ఇవ్వాలని బిల్లులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం హైస్కూల్లో 130 మంది పిల్లలు ప్రాధమిక స్కూల్లో 50 మంది పిల్లలు చదువుతున్నారు వారికిచ్చే మెస్ బిల్లు చాలా తక్కువ ఉంది కానీ వారానికి మూడు రోజులు కోడిగుడ్డు ఇస్తున్న ప్రభుత్వం పిల్లలకు ఇచ్చే మెస్ బిల్లు మాత్రం తక్కువ గా ఇస్తుంది ఒక కోడి గుడ్డు ఏడు రూపాయలు ఉంటే పిల్లలకు ఇచ్చేది చాలా తక్కువ ఇస్తున్నారు ఐదు రూపాయల 45 పైసలు ఇస్తున్నారు మెస్ బిల్లులను తక్షణమే పెంచాలి నిరుపేద పిల్లలు కు అందాల్సిన పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది కోడిగుడ్డు బందు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని రోజుకో కోడిగుడ్డు ఇవ్వాలని అన్నారు నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రభుత్వం ఇచ్చేటువంటి రూపాయలు ఎటు సరిపోవడం లేదు మధ్యాహ్న భోజన కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ అప్పులు చేస్తూ వంట చేస్తా ఉన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచి ఇవ్వాలి తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలను బిల్లులను విడుదల చేయాలని గ్యాస్ పొయ్యిలు లేక కట్టెల పొయ్యితో వంట చేస్తా ఉన్నారు గ్యాస్ పోయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం
