బిజెపి రాష్ట్ర నాయకులు పోషం,అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేష్, పట్టణ అధ్యక్షులు అశోక్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ పరిపాలన సంవత్సర కాలం గడిచిన నేపథ్యంలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారనే భ్రమలో పడి ప్రజలను మోసం చేసి ప్రజాధనంతో సంబరాలు నిర్వహిస్తోందని బిజెపి రాష్ట్ర నాయకులు ఆరుమూల్ల పోశం, నియోజకవర్గ కన్వీనర్ అక్కల రమేష్, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు వేముల అశోక్ లు అన్నారు. గురువారం బిజెపి శ్రేణులు మందమర్రి నుండి రామకృష్ణాపూర్ సూపర్ బజార్ చౌరస్తా, రాజీవ్ చౌక్ చౌరస్తా, భగత్ సింగ్ నగర్ ఏరియా ల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. రాష్ట్ర బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 1 నుండి 5వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హామీతో ప్రభుత్వం ఏర్పాటు చేసి పాలనను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదని, అందుకు భిన్నంగా ప్రజా ధనంతో సంబరాలు నిర్వహిస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, దన్ సింగ్, సత్యనారాయణ, వైద్య శ్రీనివాస్, కళాధర్ రెడ్డి, సాయి, శ్రీలత ,పద్మ,బిజెపి నాయకులు పాల్గొన్నారు.