ప్రజా ఆరోగ్యనికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట

చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన ప్రభుత్వ విప్

హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

చందుర్తి, నేటిధాత్రి:

ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం చందుర్తి మండల కేంద్రంలో రూ. 1 కోటి 56 లక్షలతోప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించగా, విప్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడారు.ఈ ప్రాంతంలో పేద ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సుమారు 240 పై చీలుకు నూతన అంబులెన్స్ లను మంజూరు చేసిందని అందులో భాగంగా రుద్రంగి,కొనరావుపేట మండల కేంద్రాలకు అంబేలెన్సు లను మంజూరు చేశామని తెలిపారు.. రుద్రంగి మండల కేంద్రంలో 1.50 కోట్లతో నూతన ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామని తెలిపారు..ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీ వేశారని, ఈ ఏడాది ఇప్పటివరకు వివిధ శాఖల్లో దాదాపు 55000 ఉద్యోగాలు భర్తీ చేశామని, వాటిలో 12 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి ఉంచాలని సంకల్పిస్తుందని అన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మాల్యాల గ్రామానికి వచ్చి 1737 కోట్ల తో సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసారని తెలిపారు.. ఆనాడు పేద ప్రజల కోసం 2 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ ప్రారంభం చేసుకొని నేడు దానిని 10 లక్షల వరకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు..ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో ఎప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా 800 కోట్ల మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు..ఎమ్మెల్యే గా గెలిచిన నాటి నుంచి ఎల్విసి, ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా సుమారు 10 కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు..రాజకీయంగా జన్మనిచ్చిన చందుర్తి మండలాన్ని ఎప్పుడు కూడా మరిచిపోనని తెలిపారు… ఒక్క ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత వరకు వచ్చనని అన్నారు.చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని త్వరలోనే 30 పడకల ఆసుపత్రికి మార్పు నాకు కృషి చేస్తానని చెప్పారు.. రుద్రంగి మండల కేంద్రానికి 42 కోట్లతో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ ను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు..గత ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను మోసం చేసిందని ,కానీ ప్రజా ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు.. తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఎక్సగ్రెసియా చెక్కును వేములవాడ నియోజకవర్గ పరిధిలోనే ఇచ్చామని,జిల్లాలో 17 మందికి ఇవ్వడం జరిగిందని అన్నారు..రైతులకు ఏక కాలంలో2 లక్షల రుణమాఫీ చేసాం అని అన్నారు.. గతంలో ఎమ్మెల్యే కాకున్నా ఒకే మండలంలో రెండు జూనియర్ కాలేజ్ లను మంజూరు చేయించనని తెలిపారు..మొన్నటి రోజున మాల్యాల గ్రామంలో నూతన బ్యాంక్ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు..తనను ఉమ్మడి ఆస్తిగా భావించాలని తనద్వారామన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేశ్వర్,జిల్లా వైద్య అధికారి వసంత రావు,మండల వైద్య అధికారి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!