కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి

బిజెపి నాయకుల ఒక్కరోజు రైతు నిరాహార దీక్ష

బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పిలుపు మేరకు గురువారం రోజున బోయినిపల్లి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టడం జరిగినది, ఈ రైతు దీక్షలో బిజెపి మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని రైతు దీక్ష చేపట్టడం జరిగింది అని అన్నారు, ఈ సందర్భంగా గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వo, ఎన్నికల ముందు వంద రోజులలో చేస్తానన్నా హామీలు రైతు పండించిన పంటకు క్వింటాల్ వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్, రైతు భరోసా కింద ఎకరానికి రైతుకు15000 రూపాయలు, కౌలు రైతుకు 15000 రూపాయలు, రైతు కూలీలకు 12,000/-రూపాయలు, రెండు లక్షల రూపాయల రుణమాఫీ,2,00,000, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి,వరి ధాన్యాన్ని కొనుగోళ్ల పేరుతో తాలూ తరుగు తేమ పేరుతో క్వింటాల్ కు 10 కిలోల అధిక దోపిడీని అరికట్టాలి అని డిమాండ్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బిజెపి చొప్పదండి నియోజకవర్గం జాయింట్ కన్వీనర్, ఉదారి నరసింహ చారి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఎడపల్లి పరశురాములు, ఉపాధ్యక్షులు రెడ్డ వేణి రాజు, దళిత మోర్చా మండల అధ్యక్షులు సుంకపాక ప్రభు, యువ మోర్చా మండలాధ్యక్షులు కొనుకటి హరీష్, బిజెపి సీనియర్ నాయకులు శక్తి కేంద్రం ఇన్చార్జి క్యాతం తిరుపతిరెడ్డి, బిజెపి మండల కార్యదర్శి రేండ్ల మహేందర్, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి రాజూరి కిరణ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి మినుకుల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు సింగరి వెంకటేష్, రజనీకాంత్, ధర్మేంద్ర, మేదరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!