వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు
మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు

బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే, మాట్లాడుతూ.ఈనెల 27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు తరలిరావాలని ,ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజల భవిష్యత్ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,పెంట రెడ్డి,
జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,బీసీ సెల్ మండల అధ్యక్షులు అమిత్ కుమార్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు హీరు రాథోడ్,మైనార్టీ మండల అధ్యక్షులు వహీద్,మండల పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి,మాజి సర్పంచ్ లు చిన్న రెడ్డి,విజయ్ ,అబ్రహం,మాజి ఎంపీటీసీ లు బస్వరాజు,రాములు,శంకర్,గ్రామ పార్టీ
అధ్యక్షులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.