
Police Stand by Home Guard
అనారోగ్యంతో బాధపడుతున్న హోంగార్డ్ ను
ఆదుకున్న పోలీస్ శాఖ అధికారులు
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )
సిరిసిల్ల జిల్లాలో హోమ్ గార్డ్ గా విధులు నిర్వహిస్తూ,అనారోగ్యంతో బాధపడుతున్న శివకుమార్ కి జిల్లా పోలీస్ యంత్రాంగం బాసటగా నిలిచి స్వచ్ఛందంగా (55,000/- రూపాయలు) జమచేసి వారి కుటుంబా సభ్యులకు ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐ.పి.ఎస్ చేతుల మీదుగా శివకుమార్ కుటుంబ సభ్యులకు అందించడం జరిగినది.పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని,తోటి సిబ్బంది ఆపదలో ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని ఎస్పీ అన్నారు.ఈ సందర్భంగా ఆర్.ఐ లు యాదగిరి,రమేష్, పోలీస్ శాఖ అధికారులు మరియు శివకుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.