Traditional Grain Measures: Memories of a Lost Rural Era
అడ్డెడు ముత్యాలు.. ఆరబోసిన రీతి…..!
అర్ధశేరు.. పావుశేరు..
ఇప్పుడేం కావాలన్నా సూపర్ మార్కెట్లోకి వెళ్లి ‘100 గ్రాములియ్యి. 200 గ్రాములియ్యి’ అని గ్రాములల్లో కొనుక్కొని వస్తున్నాం. కానీ వ్యవసాయం పండగలా సాగిన రోజుల్లో టెక్నాలజీ టెంట్ వేయని రోజుల్లో అద్ద శేరు’.. ‘పావుశేరు’ కొలతల్లో తెచ్చుకునేవాళ్లు. అద్దశేరు అంటే అద్దకిలో అన్నమాట. అట్లనే పావుశేరు అంటే పావు కిలో, బాట్లు.. తక్కెడ లేవీ అవసరం లేకుండానే ధాన్యాన్ని అద్దశేరు.. పావుశేరు పాత్రలల్లో నింపి కొలిచేది. ఇండ్లలో ఎక్కువగా శేరు హవా నడుస్తుండె. మామూలుగా ఆరోజుల్లో శేరు బియ్యం పెడితే ఇంటిల్లిపాది సరిపోయేది. కొంచెం బూకరొళ్లుంటే శేరులేప్తడు’ అని మజాక్ చేసేటోళ్లు,
జహీరాబాద్ నేటి ధాత్రి:
https://youtu.be/FNA9Z2jcGNY?si=-UHZrjOyg8jxN1q8
ఒకతరం జ్ఞాపకం ధాన్యం కొలతల పాత్రలు. ఇప్పుడంతా డిజిటైలేజన్ కదా.. అప్పటి పాత్రలెక్కడివి? పాట్లు ఎక్కడివి.? చెమట చిందింది వందేళ్లు బతికిన తరం.. ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం.. చేసిన పనికి పైఠంగా ధాన్యం గింజలు పొందిన తరం అనుభవించిన కొలత పాత్రలు ఇప్పటి పిల్లలు తెలుసుకోవా ల్సిందే. మనం తెలియజెప్పాల్సిందే.
-ఫీచర్స్
ధాన్యం కొలతలకు..
బంధాలకు.. బంధుత్వాలకు విలువనిచ్చిన రోజులవి. ఫోన్లు.. కార్ల కంపు ఏదీ లేదు. అస్తులకన్నా.. ఆప్యాయతలే ముఖ్యం. ఆనాడు. ఎన్ని భేదాభిప్రాయాలున్నా అందర్నీ కలుపుకొని వెళ్లగలిగే గొప్ప మనుసులున్న కాలం, అయినా పైసలతో పెద్దగా పనిలేదు కాబట్టి భేదాభిపాయాలకు కూడా చాలా తక్కువ అవకాశం ఉండేది. ఎమున్నా పనికి ధాన్యం ఇచ్చేది. వ్యవసాయంలో అయినా.. ఇండ్లలో అయినా ఆ ధాన్యాన్ని కొలిచే పనే ఎక్కువగా ఉండేది. మిగతా వాటికి అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు కాదు. వద్దు. జొన్నలు, సజ్జలు.. కందులు.. బొబ్బర్లు.. తైదలు ఇట్లా అన్నింటినీ ఇనుప కొలమానాలతో కొలిచేది.
తవ్వెడు.. మానెడు..

ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అందరికీ శేరు బువ్వగానీ లేదా గట్క గానీ సరిపోకపోయేది. మామూలుగా రెండు పూటలా వండెటోళ్లు.. అదికూడా ఉడుకుడుకే తినేటోళ్లు కాబట్టి పొద్దున లేరు.. మాపు శేరు పెడ్తుండె. ఐతే.. చాలామంది సుట్టాన్ని.. పక్కాన్ని దృష్టిలో పెట్టుకొని పూటకు రెండు శేర్లు వండుతుండె. రెండు శేర్లను ‘తవ్వెడు” అంటుండె. తవ్వెడుతోనే పనిబాటలోళ్లకు వడ్లు లేదా జొన్నలు పెట్టేది. పది తవ్వల్లో లేదా… 15 తవ్వలో గానీ మొత్తానికైతే వాటితోనే పెట్టెటోళ్లు. తవ్వెడుకు డబల్ మానెడు. అంటే దీంట్లో 4 శేర్లు పడత యన్నమాట.
అడ్డెడు అడ్డెడు పోసినారు
బియ్యం.. పప్పులు.. సజ్జలు.. జొన్నలు. చేబదులు చేసుకునేది చాలామంది. ‘అడ్డెడు అమ్లాలు పెట్టక్కా.. మల్లతాపకు డబల్ పెడతా’ అని ఇచ్చిపుచ్చుకునేది. అడ్డెడు అంటే ఎనిమిది శేర్లు. అద్దెడుకు రెండింతలు కుంచెదు. అంటే 16 శేర్లు. మామూలుగా బావుల కాడికి.. పొలం పనికి పోతే మొగోళ్లకు కుంచెడు కూలీ వేస్తుండె. అంటే వరిగొయ్య నోతె పదహారు పేర్ల వడ్లు వేసెటోళ్లు. అదే జొన్నలేను కొయ్యవోతె మాత్రం పది పేర్లు వేస్తుండె. ఆడోళ్లు వరిశేను కొయ్యవోతె ఒక అడ్డెడు.. ఒక మానెడు కూలీ వేసేదీ, పాటలే పోసనారు ఐడా బార్డరు అద్దెడు ఐద్రాబాదు. కట్టినారు’ అనీ.. అంటే పన్నుగా దాన్యమే చెల్లించేది.
ఇద్దుము.. పుట్టెడు..
పెద్ద పెద్ద ఆసాముల దగ్గర కూడా ‘అద్దెడు’ మేజర్ కొలపాత్ర. ఇక దాన్ని మించి అంటే కుండేదు ఉంటది, కుండెడు అంటే 20 శేర్లు. నాలుగు కుండలు పోస్తే ఒక బస్తా వడ్లు అవుతాయి. రెండు కుండలు కొలిస్తే దానిని ‘తూమెడు’ అంటారు. అంటరు కదా.. వాడు కూసుంటే తూమెడు ఐపోవాల్సిందే’ అని. అంటే ఆరోజుల్లో గొడ్డు కష్టం చేసేవాళ్లు కదా? తిండికూడా ఆ మోతాదులోనే తినేటోళ్లు. ఇంకా ఇద్దుము.. పుట్టెడు ఇట్లా చాలా ఉంటాయి. 40 బస్తాల ధాన్యం అయితే దాన్ని పుట్టెడు అంటారు. ఇక ఏ రైతైనా పుట్టెడు పండిస్తే గుడ్డిలో మెల్ల బెటర్ అన్నమాట.
