ముత్తారం :- నేటి ధాత్రి
గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల సేవలు ఎంతో గొప్ప వని, వారి సేవలు మరువలేనివని ముత్తారం ఎస్ఐ మధుసూదన్ రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో
మండల ఫోటో, అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
హైదరాబాదు లోని కే బి ఆర్ కన్వెన్షన్ హాల్ ఎల్బీనగర్ లో జరిగే ఫోటో ఎక్స్పో పోస్టర్ల ఆవిష్కరణ ను ఎస్ఐ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అనుము వీరస్వామి, ఉపాధ్యక్షులు తిరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజేందర్, కోశాధికారి గూట్ల తిరుపతి, చొప్పరి రమేష్, దేశిని రాజు, వెంగళరాజు, కుమార్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఫోటోగ్రాఫర్ల సేవలు మరువలేనివి పోస్టర్ ఆవిష్కరణలో ముత్తారం ఎస్సై మధుసూదన్ రావు
