గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
కష్టకాలంలో పార్టీ కోసం సేవలందించిన కార్యకర్తల సేవలు మరువలేనివి అని టీడీపీ మండల అధ్యక్ష కార్యదర్శులు తోలెం సాంబయ్య, ఇల్లెందుల అప్పారావు, నియోజకవర్గ సమన్వయకర్త ఇల్లందుల నర్సింహులు పేర్కొన్నారు. బుధవారం భీమునిపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త సనప నగేష్ అనారోగ్యంతో మృతి చెందారని గత తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడన్నారు. పార్టీ ఏ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా పాల్గొనే వాడన్నారు. ఆయన అకాలమరణం బాధాకరమన్నారు. ఈకార్యక్రమంలో తోలెం బుచ్చన్న,పోలు కనకయ్య,వాగబోయిన రాములు, ఆవుల శ్రీను, విజయ్ తదితరులు పాల్గొన్నారు.