
ఆవుల అశోక్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
కారేపల్లి నేటి ధాత్రి.
దేశం ప్రశాంతంగా ఉండాలన్న కార్పొరేట్ దోపిడీని అడ్డుకోవాలన్న ప్రజలకు కనీస ప్రజాస్వామ్యమైన దక్కాలంటే ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ బిజెపిలను తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్ అన్నారు గురువారం స్థానిక కారేపల్లి లో జరిగిన మండల స్థాయి ముఖ్య కార్యకర్త సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ దేశమంతా అల్లర్లతో అల్లకల్లంగా మారుతుందని భవిష్యత్ తరాల మెదల్లో విష బీజాలు నాటే పని చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు 400 సీట్లు గెలిపిస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ని సిగ్గుగా ప్రకటిస్తున్న వైనాన్ని దేశ ప్రజలు పరిశీలించాలని ఆయన కోరారు .మన ధర్మాన్ని తీసుకొచ్చి ఫ్యూడల్ పద్ధతులుప్రవేశపెట్టాలని బిజెపి ప్రయత్నిస్తుందని, నల్ల డబ్బు బయటికి తీసుకొస్తానన్న మోడీ తీసుకురాక పోగా అధికారంలోకి వచ్చాక అవినీతిని చట్టబద్ధత కల్పించి ఎలక్ట్రో బాండ్ల రూపంలో వేలకోట్లు కార్పొరేట్ వ్యక్తుల దగ్గర నుంచి దండుకున్నారని ఆయన అన్నారు . ఆకలి సూచికలు దేశం 120 స్థానంలో ఉందని హ్యాపీ ఇండిపెండెన్స్ లో కూడా 125 స్థానంలో దేశం ఉందని ఇంత దరిద్రమైన పాలన అందిస్తున్న మోడీ సిగ్గు పడకు పోగా విశ్వగురు అని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశభక్తి ప్రజాతంత్ర వామపక్ష విప్లవ పార్టీలన్నీ పాసిస్ట్ బిజెపి ను ఓడించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి టి ఝాన్సీ మండల కార్యదర్శి గుమ్మడి సందీప్ సహాయ కార్యదర్శి ఎన్ వి రాకేష్ మండల నాయకులు ధరావత్ సక్రు పులకాని సత్తిరెడ్డి వడ్డే వెంకటేశ్వర్లు బాలు బిక్కసాని భాస్కర్ రావుల నాగేశ్వరరావు రంగ్య, చల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.