రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోగిల మహేష్
భద్రాద్రికొత్తగూడెం :నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన కమిటీ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించిన రెండవ విడత దళిత బంధు లబ్ధిదారులు రెండో విడత దళిత బంధు నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కోకిల మహేష్, రాష్ట్ర కోఆర్డినేటర్ మడికొండ రమేష్, రాష్ట్ర సలహాదారు దర్శనాల సంజీవ మాట్లాడుతూ గత పది నెలలుగా ఎన్నో శాంతియుత కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం రెండో విడత దళిత బంధు నిధులపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు కాబట్టి సోమవారం ధర్నాకు దిగడం జరిగిందని తెలిపారు. ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దయచేసి చింతకాని మండలానికి ఇచ్చి దళితులకు న్యాయం చేసినట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రెండో విడత దళిత బంధు లబ్ధిదారులందరికీ కేటాయించిన మొదటి విడత మూడు మూడు లక్షల రూపాయలను వెంటనే మంజూరు చేయాలని అలాగే అంబేద్కర్ స్కీంను కూడా త్వరలోనే ప్రారంభించి తెలంగాణలో ప్రతి దళిత కుటుంబానికి అంబేద్కర్ అభయ హస్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దళితుల ఓట్లతోటే ప్రభుత్వంలోకి వచ్చినవని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రజా భవాన్ ఎదురుగా ఇచ్చిన మాటను గౌరవ భట్టి విక్రమార్క నిలుపుకోవాలని దళిత బంధు కోసం కేటాయించిన వెయ్యి కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేయాలని వారంలోగా దీనిపై స్పష్టత ఇవ్వకుంటే అన్ని పక్షాలను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం పైకి ఉద్యమిస్తామని వారు తెలిపారు.
అనంతరం కలెక్టరేట్ లోపటికి వెళ్లి కలెక్టర్కు దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని వారు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బుల్లబ్బాయి పినపాక నియోజకవర్గం కోఆర్డినేటర్ ప్రవీణ్ మహిళా విభాగం నాయకురాలు సుజాత,పినపాక సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బొమ్మర్ల సతీష్, బొమ్మెర్ల పద్మారావు,సల్లూరి సురేష్,చెలికాని రామకృష్ణ,ప్రసాద్ బుద్ధుల,పూజారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.