దంచి కొడుతున్న ఎండలు.. ఉక్కపోతతో ప్రజల ఉక్కిరి బిక్కిరి
నిప్పుల కొలిమి..!
◆ దంచి కొడుతున్న ఎండలు
◆ ఉక్కపోతతో ప్రజల ఉక్కిరి బిక్కిరి
◆ జిల్లాలో 42.5 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
◆ జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపం దాల్చి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 దాటితే భానుడు భగభగమనడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. సూర్యుడు రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిమి తట్టుకునేందుకు ఫ్యాన్లు, కూలర్లు నడిచినా ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఉదయం 10 గంటలకే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎండకు తోడుగా వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని 38 ప్రాంతాల్లో 40.1 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం, కడ్పల్, నిజాంపేట్, కల్హేర్ 42.1 పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, న్యాల్ కల్, కోహిర్, ఝరాసంగం, 39 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. శనివారం 40 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత ఆదివారం వచ్చేసరికి 42.5 డిగ్రీలు దాటేసింది.

జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు..
పాల్వట్ల, అన్నాసాగర్, పాశమైలారం, దిగ్వాల్, సిర్గాపూర్, పుల్ కాల్, గుండ్ల మాచనూర్, నారాయణఖేడ్, ఆర్సీ పురం, 41.1 పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వట్టిపల్లి, హత్నూర్, మనూర్, అందోల్, లక్ష్మీ సాగర్, పటాన్ చేరు, మునిపల్లి, కంది, సదాశివపేట్, కిష్టారెడ్డిపేట్, కంగిటి, సుల్తాన్ పూర్, గుమ్మడిదల, కొండాపూర్, రాయికోడ్, రుద్రారం, చౌటకూర్, జహీరాబాద్, మొగుడంపల్లి, నాగలిగిద్ద, సంగారెడ్డి, ముక్తాపూర్ తదితర ప్రాంతాల్లో 40.1 డిగ్రీలకు పైగా ఎండలు దంచి కొట్టాయి. మరోవైపు రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. అర్ధరాత్రి ఉక్కపోత ఎక్కువగా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండలకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.
అత్యవసరమైతేనే బయటికి వెళ్లండి..

పలు ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లేటప్పుడు తాగునీటిని వెంట తీసుకె ళ్లాలి. ఓఆర్ఎస్ ను విని యోగించాలి. 12గం టల నుంచి 3గంటల వరకూ బయటకు వెళ్లాడు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. చిన్నపిల్లలను, గర్భిణులు, వృద్ధులను ఎండలో బయటకు తీసుకెళ్లకూ దదు. చాయ్, కాఫీ, ఆల్కహాల్ చక్కెర అధికంగా ఉన్న ద్రవపదార్థాల ను తీసుకోవద్దు. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరేచనాలు, ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. అత్యవసరమైతే డాక్టర్లు సంపాదించాలి.
సరమైతే డాక్టర్లు సంపాదించాలి. -డాక్టర్ రమ్య, మండల వైద్యాధికారి ఝరాసంగం,