
The SC Sub-Plan Act should be implemented across the country.
దేశవ్యాప్తంగా ఎస్సీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి.
దళిత హక్కుల పోరాట సమితి(డిహెచ్పిఎస్)జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్
కరీంనగర :నేటిధాత్రి
కరీంనగర్ జిల్లా డిహెచ్పిఎస్ కౌన్సిల్ సమావేశం బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా ఉపాధ్యక్షులు కెలపాక వినోద్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్ మాట్లాడుతూ ఈనెల 10,11,12 తేదీలలో వేములవాడలో జరుగు రాష్ట్రస్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ సంక్షేమం పేరిట గడిచిన ఏడు దశాబ్దాలుగా అనేక పథకాలు ప్రవేశపెట్టి ఎంతో గొప్పగా అమలు చేస్తున్నట్టు చెప్పినప్పటికీ ఈవర్గాల్లో వెనుకబాడుతనం పేదరికం పోలేదని ఇప్పటికీ సమాజంలో అత్యంత పేదరికం అనుభవించే వారే దళితులు అని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి మాట్లాడుతూ ప్రత్యేక చట్టాలు సదుపాయాలు సబ్ ప్లాన్ తదితర సౌకర్యాలు కల్పించామని చెప్తున్నప్పటికీ దళితుల బతుకులు మౌలికమైన మార్పు రావటం లేదని ఈవిషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీల విద్య సామాజిక వికాసంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన కార్యచరణ రూపొందించి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎస్సీలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలని అన్నారు. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం మూలంగా దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతున్న అన్నారు
ఈనెల 10వ తేదీ నుండి వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మేధావులైనటువంటి దళిత ప్రొఫెసర్స్ వచ్చి రాష్ట్ర శిక్షణ శిభిరాలలో దళితులపై జరుగుతున్న దాడులు సమస్యలపై ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఈసమావేశంలో కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి ఉపాధ్యక్షులు గంగాధర రఘు, కార్యదర్శి ఖండే ఎల్లయ్య, నాయకులు కొంకటి మొగిలి, చంచల భీమయ్య, రమేష్, మొగిలి, పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.