
నడికూడ,నేటి ధాత్రి:
నడికూడ గ్రామ సర్పంచ్ గా ఎన్నిక గురువారంతో 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు మరియు సర్పంచ్ గా ఎన్నుకున్న నడికూడ గ్రామ ప్రజలకు, నడికూడ గ్రామ అభివృద్ధి కోసం నేను ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన నా వెన్నంటి నడిచిన ఉప సర్పంచ్, కిన్నెర మణి, మరియు గ్రామ పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నాకు అన్ని విధాలుగా అభివృద్ధి కోసం నిరంతరం ప్రోత్సహించిన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మరియు మండల పరిషత్, పంచాయతీ రాజ్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, వైద్య శాఖ, వ్యవసాయ శాఖ, గ్రామ పంచాయతీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి,ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు అందరి సహకారంతో ఉత్తమ సర్పంచ్ గా కలెక్టర్ అవార్డ్ ప్రధానం చేశారు. అలాగే నాకు అన్ని రకాలుగా అందరూ సహకరించడం వల్ల నడికూడ గ్రామం అభివృద్ధి చెందిందని అన్నారు. నడికూడ సర్పంచ్ గా ప్రజలందరి కష్ట సుఖాలలో అందరికి అండగా ఉండడం జరిగింది.నడికూడ గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజలు అందరూ కూడా కులాలకు, మతాలకు అతీతంగా పార్టీలకు సహకరించారు. ఈ ఐదు సం”ల కాలంలో మీ అందరికి నా వంతు ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికి సేవ చేశారని, సర్పంచ్ గా ఎన్నుకున్న ప్రజలకు, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కి, గ్రామ పాలక వర్గానికి, మండల పరిషత్, పంచాయతీ రాజ్ శాఖ,పోలీస్ శాఖ, శాఖ, రెవెన్యూ శాఖ,వైద్య శాఖ,వ్యవసాయ శాఖ, గ్రామ పంచాయతీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, బిఆర్ఎస్ గ్రామ నాయ కులు, కార్యకర్తలకు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు ధన్యావాదాలు తెలిపారు. మీ సహకారం జీవితంలో మరువలేనని అన్నారు.