
Tekumatla Sand Quarry Must Be Stopped
టేకుమట్ల మండల కేంద్రంలోని ఇసుక క్వారీ రద్దు చేయాలి
ఎలుకటి రాజయ్య టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు
సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్.
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండల కేంద్రం చలివాగులోని ఇసుక క్వారీని రద్దు చేసి సహజ వనరులను కాపాడాలని టీఎస్ టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ,సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ లు కోరారు. ఈ సందర్బంగా వారు చలివాగులోని ఇసుక క్వారీని సందర్శించిన అనంతరం వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ ఇసుక దందా జరుగుతుందని, ఒక ట్రిప్పుకు పర్మిట్ తీసుకుని అనేక ట్రిప్పులు ఇసుక రాత్రి అనక పగలు అనక తరలిస్తూ కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారని,ఇసుకను విచ్చలవిడిగా డంపులు చేస్తూ లారీల ద్వారా పట్టణాలకు తరలిస్తున్నారని అన్నారు.ఈ దందా చేస్తున్న అధికారపార్టీ, మరియు ప్రతిపక్ష పార్టీల నాయకులు మండల ఉన్నత అధికారులపై ఒత్తిడి చేసి పర్మిట్లు ను మరియు పట్టుబడిన వాహనాలను విడిపించుకుంటున్నారని, చిట్యాల మరియు రేగొండ మండలాలకు సంబందించిన ట్రాక్టర్లు అధిక సంఖ్యలో డంపులు చేస్తూ ఇసుకను పట్టణాలకు తరలిస్తున్నారు.కంచె చేను మేస్తే కాపాడేవారు ఎవరు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. రోజు వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా రవాణా జరుగుతుందని, ట్రాక్టర్ డ్రైవర్లు అధిక వేగంతో, ఇష్టరీతిన నడుపుతుండటం మూలంగా దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ దందా ఈవిధంగా కొనసాగితే రానున్న రోజుల్లో సాగు, తాగు నీరుకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందని, ఇకనైనా అధికారులు స్పందించి టేకుమట్ల ఇసుక క్వారిని రద్దు చేసి టేకుమట్ల ప్రాంత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మాత్రమే పర్మిట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు..