
Welfare Girls' Gurukulam
సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి
తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి
దేశ రక్షణ కోసం పాటుపడే సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని సంక్షేమ బాలికల గురుకులం ప్రిన్సిపాల్ విజయరత్నమాల తెలిపారు.
కార్గిల్ విజయ దివస్ ను పురస్కరించుకొని మేరా యువభారత్, నవయుగ విజన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం డివిజన్ కేంద్రంలోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
అమర సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు.
నవయుగ విజన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బానోతు వీరన్న నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ….
1999 లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు శత్రుదేశంపై అసమాన పరాక్రమం ప్రదర్శించారని కొనియాడారు. శత్రు సైనికులను మట్టుబెట్టి ఆపరేషన్ విజయ్ ను విజయవంతం చేశారన్నారు. ఎందరో సైనికుల త్యాగాల ఫలితంగా భారత్ సురక్షితంగా ఉందని, వారి త్యాగాలను ఏటాస్మరించుకోవాలన్నారు. యువత, విద్యార్థులు దేశభక్తుని పెంపొందించుకోవాలని, సైన్యంలో చేరి సేవలు అందించేందుకు ముందు వరసలో నిలవాలని కోరారు.