Police Martyrs Remembered with Cycle Rally in Mutharam
పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
డీసీపీ కరుణాకర్
ఏసీపీ మడత రమేష్
ఎస్ ఐ రవి కుమార్
ముత్తారం :- నేటి ధాత్రి
పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ సి ఐ రాజు గౌడ్ టూ టౌన్ సి ఐ ప్రసాద్ రావు ముత్తారం ఎస్ ఐ రవికుమార్ మంథని ఎస్ ఐ సాగర్ కమాన్ పూర్ ఎస్ ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా, ఈదలాపూర్ గ్రామం నుండి రామగిరి గ్రామం వరకు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ నినాదాలు తో ఈ ర్యాలీ కొనసాగింది.ఈ సందర్భంగా ముత్తారం ఎస్ ఐ రవికుమార్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీసు అమరవీరుల వారోత్సవాలు ఘనంగా జరిగాయి విధి నిర్వహణలో అమరులు అయినటువంటి పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని తెలిపారు యువత ఉత్సాహంగా పాల్గొనడం వల్ల ఈ కార్యక్రమం ఘన విజయం సాధించిందని అన్నారు ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు
ఈ కార్యక్రమం లో మహిళ పోలీస్ సిబ్బంది సౌజన్య ప్రత్యూష శ్వేతా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది.
