– పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి
సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి):
సిరిసిల్ల పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికుల సంఘం మరియు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన “మే” డే ప్రపంచ కార్మికుల దినోత్సవ వేడుకలను పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు..
ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ… “మే”డే సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామనీ అన్నారు..
సిరిసిల్ల పురపాలక సంఘ అభివృద్ధిలో పరిశుభ్రత ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పురపాలక సంఘ కార్మికుల పాత్ర చాలా కీలకమైనదని అన్నారు..
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం పారిశుద్ధ్య కార్మికులు వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి విది నిర్వహణలో భాగంగా పట్టణ పరిశుభ్రత కోసం వెలకట్టలేనిదని పారిశుధ్య కార్మికుల పట్ల గౌరవంగా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉందని పారిశుధ్య కార్మికుల యొక్క గొప్పతనాన్ని తెలియజేసేలా మాట్లాడుతూ ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులందరికీ అందరికీ ప్రజలందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల శ్రమ తెలిసిన నాయకులుగా పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను గౌరవప్రదంగా పెంచి వారికి విధినిర్వహణలో అవసరమగు సేఫ్టీ కిట్లను అందిస్తూ ప్రభుత్వపరంగా వారికి అందించాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. అంతే కాకుండ కరోన సమయంలో పారిశుద్ధ కార్మికులు నిర్వహించిన సేవలకు గుర్తింపుగా వారికి 5 వేల రూపాయల చొప్పున గౌరవ ప్రోత్సాహాకన్ని అందించారని గుర్తు చేశారు. అంతేకాకుండా వారికి పి.ఎఫ్ మరయు ఈఎస్ఐ వంటి సౌకర్యాలను కల్పిస్తూ ప్రతినెల కార్మికులకు క్రమం తప్పకుండా జీతాలు అందేలా చూశారని గుర్తు చేశారు..
అనంతరం పారిశుధ్య కార్మిక నాయకులు దేవయ్య తో పతాకావిష్కరణ చేయించి ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ముసం రమేష్, కొడం రమణ, పారిశుద్ధ్య కార్మికుల సంఘం నాయకులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
ఆరోగ్య పరిరక్షణలో కార్మికుల పాత్ర చాలా కీలకం
