
*సమాజ సేవలో స్వచ్ఛంద సేవా సంస్థల పాత్ర కీలకం..
*పేదల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది..
*అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తోంది..
*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..
బంగారు పాళెం,(చిత్తూరు(నేటి ధాత్రి)
సమాజ సేవలో
స్వచ్ఛంద సేవా సంస్థల పాత్ర చాలా కీలకమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు.
ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలైన రోప్స్, సాయిల్ గ్రీన్, ఎన్.వై.కే.సంస్థలు గిరిజనులకు అండగా నిలవడం అభినందనీయ
మాని ఆయన
అన్నారు,
బుధవారం పూతలపట్టు నియోజకవర్గంబంగారు పాళెం మండలం, మొగిలి వారి పల్లి గ్రామం, జయంతి ఎస్.టి కాలనీలో నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమానికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారుఅంతకు ముందు
జయంతి యస్.టి.కాలనీకి చేరుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళకు బంగారు పాళెం మండలం టీడీపీ సీనియర్ నేత జయప్రకాష్, తెలుగు దేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, బంగారు పాళెం మండలాధ్యక్షుడు ధరణి, రోప్స్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ శ్రీలత, జపాన్ కు చెందిన ఎన్.వై.కే సంస్థ సభ్యులు, స్థానిక టిడిపి శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.
అతిథుల జ్యోతి ప్రజ్వలనతో సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారుముందుగా ఎన్నో ఏళ్లుగా వెట్టిచాకిరిలో మగ్గి విముక్తి పొందిన ఎస్టీ కార్మికులకు చిత్తూరు పార్లమెంటు సభ్యులు విముక్తి పత్రాలను అందజేశారు. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులతో కలిసి వారికి బియ్యాన్ని, నిత్యవసరాలను పంపిణీ చేశారు. వారితోపాటు గిరిజన విద్యార్థులు, ప్రజలకు బియ్యం, దుస్తులు, పుస్తకాలు, దుప్పట్లును అందజేశారు. గిరిజనుల దుస్థితిని గుర్తించి,వారికి బాసటగా నిలిచిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలైన రోప్స్, సాయిల్ గ్రీన్, ఎన్.వై.కే.సంస్థల సేవా నిరతిని ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ప్రశంసించారు. సామాజిక సేవే పరమావధిగా పనిచేస్తున్న ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు సమాజానికి అవసరమన్నారు.కూటమి ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తుందని ఆయన తెలిపారు. మరి ముఖ్యంగా గిరిజన ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను చేరువ చేసి వారి జీవితాలలో వెలుగులు నింపుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సునీల్ చౌదరి, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాటిభట్ల శేఖర్ బాబు,రోప్స్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.