ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్.
మరిపెడ నేటిదాత్రి.
ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారదులుగా జర్నలిస్టులు నిలుస్తారని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. శుక్రవారం మరిపెడ పట్టణంలో మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎమ్మెల్యేను కలవగా ప్రెస్ క్లబ్ కమిటీని ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.ప్రభుత్వ పథకాలను మారుమూల పల్లెలకు చేరవేయడంలో విలేకరుల పాత్ర కీలకమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ యాజమాన్యాలను ధిక్కరించి మరి ఉద్యమానికి స్థానిక జర్నలిస్టులు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం రిపోర్టర్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రిపోర్టర్ల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన స్థానిక జర్నలిస్టులకు ఇందిరమ్మ గృహాలు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామీణ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వారి అభ్యున్నతి కోసం మండల ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షుడు గండి విష్ణు గౌడ్, అధ్యక్షుడు పర్వతం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మారం అనంతరాములు,లను శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, ఐలమల్లు, రవినాయక్,అనంత సాయి,
సీనియర్ జర్నలిస్ట్ దాసరోజు బాలకృష్ణ, రేఖ అశోక్, కారంపూడి వెంకటేశ్వర్లు, మూడవత్ రవికుమార్, దేవరశెట్టి శ్రీశైలం,గంధసిరి ఉప్పలయ్య, మాడు శ్రీకుమార్, బొడపట్ల వెంకన్న,చింతా వెంకన్న,రాంపెల్లి కపిల్ గౌడ్,ప్రవీణ్ ,తప్పెట్ల సురేష్ ,ఉప్పల రమేష్,పులుసు సతీష్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.